ఎప్పుడూ సినిమాలు, సరదా కబుర్లే కాకుండా ప్రస్తుతానికి వార్తల్లో బాగా నలుగుతున్న 'ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు' అనే కాన్సెప్ట్ మీద నా అభిప్రాయం రాద్దామనుకున్నాను. ఈ ఇంగ్లీష్, తెలుగు మీడియం చదువుల డిబేట్ ఎప్పటికీ తీరేది కాదు కానీ నా స్టాండ్ అంటూ ఒకటి ఏడ్చి ఉంటుంది కదా అది రాద్దామని ఈ ప్రయత్నం. ఇలాంటి టాపిక్స్ 'నా కప్ అఫ్ టీ' కాదు అని నాకు తెలుసు కానీ ఏదో రాద్దామని చిన్న ప్రయత్నం అంతే.
'దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ' అని ఒక సారి సినిమా హీరో నాగార్జున T.V ఇంటర్వ్యూ లో అన్నాడు. దాని అర్థం ఏమిటన్నది తెలీదు కానీ అబ్బో వీడికి భలే ఇంగ్లీష్ వచ్చన్నమాట అని నా మిత్రులంతా అనుకునేవారు. మీ చిరంజీవి ఒక్క సారన్నా ఇంగ్లీష్ మాట్లాడాడా అని వాళ్ళు మమ్మల్ని దెప్పి పొడిచేవారు. ఈ విషయం లో మేము ఏమీ మాట్లాడలేకపోయాం. అంటే అర్థం ఏమిటి తెలుగు వచ్చిన వాడికంటే ఇంగ్లీష్ వచ్చిన వాడికే మనం అట్ట్రాక్ట్ అవుతాం అని.
కాబట్టి నా ప్రియాతి ప్రియమైన తెలుగు అభిమానులారా, ఎక్కువ మంది ప్రజలు అమ్మ పాల లాంటి తెలుగు కంటే ఎంగిలిపీసు అయినా ఇంగ్లీష్ వైపుకే కాస్త ఎక్కువ మొగ్గు చూపుతారు అని నా ఉద్దేశం. నా వరకు నేను చెప్పొచ్చేది ఏమిటంటే అన్ని సబ్జక్ట్స్ ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే ఉండి తీరాలి, అలాగని మాతృ భాషను తక్కువ చెయ్యాలని కాదు కానీ తెలుగు కూడా కంపల్సరీ సబ్జెక్టు గా పెట్టాలి. అది కూడా ఏదో మొక్కుబడి కోసం సంస్కృతం సబ్జెక్టు పెట్టినట్లు కాకుండా. కుండ లో ఉండే కూడు అట్టాగే ఉండాలి, పిల్లాడు మాత్రం గుండులా తయారు కావాలి అంటే కుదరదు. తెలుగు మీడియం ను పక్కకు తోసేసి, తెలుగును మాత్రమే ముందుకు తీసుకెళ్లాలి, వాటితో పాటు మిగిలిన సబ్జక్ట్స్ ఇంగ్లీష్ లో భోదించాలి.
మన పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభ చాటాలంటే ఖచ్చితంగా మొక్కగా ఉన్నప్పుడే ఇంగ్లీష్ అందిస్తూ ఉండాలి, మాను అయిన తర్వాత అందించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. మొక్క, మాను చీప్ తెలుగు వర్డ్స్, ఎవడికి అర్థమవుతాయి ఈ కాలంలో నా పిచ్చి కాకపోతే.
ఏం, నిజ్జంగా సర్కార్ స్కూళ్ళలో చదువుకొని అంతర్జాతీయంగా తమ సత్తా చాటిన వాళ్ళు లేరా అని అనొచ్చు కానీ వారి సంఖ్య కూడా వేళ్ళ మీద లెక్క పెట్టగలిగేటంత మాత్రమే అన్నది అక్షరాలా నిజం.
చిన్నప్పుడు గవర్నమెంట్ బడుల్లో చదువుకున్నాను కాబట్టి ఆ అనుభవాలతో చెప్తున్నాను. సైన్స్, మ్యాథ్స్ లాంటి సబ్జెక్టులన్నీ తెలుగులో చదివి పౌనపున్యం, ఆరోహణ, అవరోహణ, కూడికలు, తీసివేతలు, గుణింతాలు, భాగహారాలు, కక్ష్య, భూపరిభ్రమణం, వైశాల్యము, విస్తీర్ణం, లంబ కోణం అని చదువుకున్నాను, ఆ తర్వాత కాలేజీ రోజులకు వచ్చాక తర్వాత వాటిని ఇంగ్లీష్ లో ఏమంటారో సరిగ్గా తెలీక ఇబ్బంది పడ్డ సందర్భాలెన్నో ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన కుర్రాళ్లతో మాట్లాడేప్పుడు కొన్ని సార్లు ఎన్నో విషయాలు తెలుగులో తెలిసి ఉండీ వాటిని ఇంగ్లీష్ లో ఎలా వ్యక్తీకరించాలో తెలీక ఊరుకుండిపోయాను.
డిగ్రీ వరకు తెలుగు మీడియం లో చదివి, ఒక్కసారిగా M .C. A ఇంగ్లీష్ మీడియం అంటే బాగా ఇబ్బందిపడ్డాను. అందులోనూ కంప్యూటర్ ఆర్గనైజషన్ అని ఒక బుక్ ఉండేది, అందులో మొదటి చాఫ్టర్ చదివి అర్థం చేసుకునే లోపే మొదటి సెమిస్టరు అయిపోయింది. ఏదో అత్తెసరు మార్కులతో పాస్ అయి బయటపడ్డాను. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువులు చదివి ఉంటే అన్ని ఇబ్బందులు ఉండేవి కాదు అని నా అభిప్రాయం.
అంతెందుకు, తెలుగు మీడియం లో చదివి ఏంతో టాలెంట్ ఉండి కూడా ఇంగ్లీష్ సరిగ్గా లేక కింది స్థాయిలోనే మిగిలి పోయిన వాళ్ళను చూశాను, టెక్నికల్ గా స్ట్రెంగ్త్ లేకపోయినా నాలుగు ఇంగ్లీష్ ముక్కలు బాగా రావడం వల్ల మానేజేర్స్ గా అధికారాన్ని చెలాయించిన వాళ్ళను చూశాను.
కాలేజీల వరకు తెలుగు మీడియం లో చదివి, వీసాల కోసం PTE/ IELTS/ TOFEL/ GR E లాంటి ఎగ్జామ్స్ లో తెచ్చుకోవాల్సినన్ని మార్కులు తెచ్చుకోలేక యెంత మంది ఇబ్బంది పడుతున్నారో ఇప్పటికీ నేను రోజూ చూస్తూనే ఉన్నాను. నా వరకు నేను PR కు అప్లై చేయడటం కోసం 3 నెలల పాటు ఇష్టం లేకపోయినా కష్టపడి ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడుతూ, ఇంగ్లిష్ మాత్రమే వింటూ, ఇంగ్లీష్ మాత్రమే తింటూ, ఇంగ్లీష్ నే తాగుతూ వచ్చాను. అసలు ఆ మూడు నెలలు ఒక్క తెలుగు సినిమా కూడా చూడలేదంటే నమ్మండి కాకపోతే ఆ 3 నెలల తర్వాత మళ్ళీ తెలుగుకు షిఫ్ట్ అయినప్పుడు సంతలో తప్పిపోయి చివరకు అమ్మ ఒడికి చేరిన బిడ్డ లాగా తెగ ఆనంద పడ్డాను.
ఒక వేళ గవర్మెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెడితే మొదట అక్కడ పనిచేసే టీచర్స్ కి తగిన శిక్షణ ఇవ్వాలి. నేను M.C.A చదివే రోజుల్లో చూసాను అక్కడ భోదించే వారికే సరిగ్గా ఇంగ్లిష్ వచ్చేది కాదు, ఇక స్టూడెంట్స్ కి వాళ్ళేం నేర్పుతారు.
ఇకపోతే మాతృ భాష మృత భాష అయిపోతుంది అని తెగ గగ్గోలు పెడుతున్న వారంతా నిజంగా తెలుగు మీద అంత ప్రేమే ఉండి ఉంటే తెలుగు భాషను బతికించడానికి మార్గాలు వెతికితే బాగుంటుంది. ఆల్రెడీ తెలుగులో చదవడం వచ్చిన వాళ్ళ సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. తెలుగు మీడియం తర్వాత, అసలు తెలుగు చదవడం అనేదే నామోషీ అయిపోయింది ఈ కాలం లో. ఎంతమంది అమ్మా, నాన్న అని పిలుస్తున్నారు వారి తల్లిదండ్రులను ఈ కాలంలో? అంతెందుకు మొన్నటి దాకా అమ్మా, నాన్న అని పిలిచినా వారే ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పాల్సినప్పుడు మా మమ్మీ, డాడీ అంటూ మొదలెడతారు.
ఏ ఎండకా గొడుగు పట్టడం ఈ రాజకీయ నాయకులకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు. తెలుగు దేశం పార్టీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువులు తీసుకొస్తాం అంటే Y.S.R పార్టీ వాళ్ళు గగ్గోలు పెడతారు, Y.S.R పార్టీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువులు తీసుకొస్తాం అంటే తెలుగు దేశం పార్టీ వాళ్ళు గగ్గోలు పెడతారు. చాలా మంది తెలుగు చచ్చిపోతోంది అని దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు గానీ వాళ్ళ ఇళ్ళు మొత్తం ఇంగ్లీష్ తోనే నిండిపోయి ఉంటుంది. గాంధీ ఎప్పుడూ పక్కింట్లోనే పుట్టాలి మనింట్లో కాదు అన్నది వీరి కోరిక.
ఇంకా ఏమైనా అంటే 'ఏ భాషలో విద్యాబోధన జరగదో ఆ భాష కొన్నేళ్ళకు అంతరించి పోతుందని ఫలానా అధ్యయనాల్లో తేలింది' కాబట్టి విద్యా భోధన మాతృభాషలోనే జరగాలి అని వాదిస్తారు. మరి ఇలా అన్నవాళ్లంతా ఈ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూళ్ళు మొదలైనప్పుడు ఏమయ్యారో తెలీదు. తెలుగు వద్దనడం లేదు, తెలుగు తప్పక నేర్పించండి, కానీ సైన్స్, మాథ్స్, సోషల్ లాంటివి ఇంగ్లీషులో నేర్పించండి.
ఏది ఏమైతేనేం, తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి అన్నట్లు ఇంగ్లీష్ మీడియం చదువులు సర్కారు బడుల్లోకి తీసుకొచ్చేశాం మీ ఇష్టమైంది మీరు చేసుకోండి అని డిసైడ్ అయినట్లు ఉన్నారు జగన్ గారు, ఏది ఏమైతేనేం ఇల్లలకగానే పండుగ కాదు, ముందుండి ముసళ్ల పండుగ ఈ ఇంగ్లీష్ మీడియం రాకతో ఎన్ని ఆటు పోట్లు ఎదురవుతాయో సర్కారు స్కూళ్లలో?
ఇంకా ఏమైనా అంటే 'ఏ భాషలో విద్యాబోధన జరగదో ఆ భాష కొన్నేళ్ళకు అంతరించి పోతుందని ఫలానా అధ్యయనాల్లో తేలింది' కాబట్టి విద్యా భోధన మాతృభాషలోనే జరగాలి అని వాదిస్తారు. మరి ఇలా అన్నవాళ్లంతా ఈ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూళ్ళు మొదలైనప్పుడు ఏమయ్యారో తెలీదు. తెలుగు వద్దనడం లేదు, తెలుగు తప్పక నేర్పించండి, కానీ సైన్స్, మాథ్స్, సోషల్ లాంటివి ఇంగ్లీషులో నేర్పించండి.
ఏది ఏమైతేనేం, తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి అన్నట్లు ఇంగ్లీష్ మీడియం చదువులు సర్కారు బడుల్లోకి తీసుకొచ్చేశాం మీ ఇష్టమైంది మీరు చేసుకోండి అని డిసైడ్ అయినట్లు ఉన్నారు జగన్ గారు, ఏది ఏమైతేనేం ఇల్లలకగానే పండుగ కాదు, ముందుండి ముసళ్ల పండుగ ఈ ఇంగ్లీష్ మీడియం రాకతో ఎన్ని ఆటు పోట్లు ఎదురవుతాయో సర్కారు స్కూళ్లలో?
కాకపోతే ఒక్కటి నిజం మన తెలుగంత తియ్యనిది ఈ లోకం లో మరొకటి లేదు, కాకపోతే చద్ది అన్నం కంటే పిజ్జా, బర్గర్లకే డిమాండ్ ఇక్కడ. జీవితంలో ఎదగాలనుకుంటే మాత్రం తెలుగును తుంగలో తొక్కడమో, గంగలో వదిలేయడమో చెయ్యాల్సిందే. అవ్వా బువ్వా రెండూ కావాలంటే మాత్రం కుదరదు, అసలే పోటీ ప్రపంచం ఇక్కడ.
'నా కప్ అఫ్ టీ' కాని విషయం మీద ఏదేదో రాసి మీకు బొప్పి కట్టించి ఉంటాను వెళ్ళి టీ పెట్టుకు తాగండి తల నొప్పి తగ్గడానికి.
'నా కప్ అఫ్ టీ' కాని విషయం మీద ఏదేదో రాసి మీకు బొప్పి కట్టించి ఉంటాను వెళ్ళి టీ పెట్టుకు తాగండి తల నొప్పి తగ్గడానికి.
రిప్లయితొలగించండిమా జగనన్న చెప్పింది చేస్తడు చేసిందే చెప్తడు :) ఆ :)
ప్రాబ్లెమ్ ఎక్కడంటే గవర్నమెంటు ఉసుకూలు లో ఎంగిలిపీసొచ్చేస్తే ఎంగిలిపీసు పేరుతో బడా ఉసకుూళ్ళను టెల్గూలోనే నడిపేస్తో ఉన్న బడా నాయక్స్ వాళ్ళ కూటికేంగాను :) అదీ తిరకాసు అని జిలేబి పాకం న్యూసు :)
జిలేబి
ఆ బడా నాయక్స్ కి వాళ్ళ వాళ్ళ ప్లాన్స్ వాళ్లకు ఉంటాయి జిలేబి గారు ఈ ఇంగిలీషు బడులను అడ్డుకోవడానికి
తొలగించండి// "మీ చిరంజీవి ఒక్క సారన్నా ఇంగ్లీషు మాట్లాడాడా .." //
రిప్లయితొలగించండిమాట్లాడక పోవడమేమిటి పవనూ? ఒక సినిమాలో "in front there is crocodile festival" అంటూ ఇంగ్లీషు అదరగొట్టేశాడుగా? సో, చిన్ళబుచ్చుకోకండి 👍😃.
"ఏదీ ఒక్కసారి face turning ఇచ్చుకోండి" అన్న డయలాగులో కూడా ఎంగిలిపీసు ఉందండోయ్!
తొలగించండిసినిమాల్లో డైలాగులు కాదండీ, ఇంటర్వ్యూ లో. ఎనీహౌ బాగా గుర్తు చేశారు మా బాస్ ఇంగిలీషు డైలాగులను
తొలగించండిపాపం వీఎన్నారు గారు చిరు నామం వినబడునంతనే బుస్సున లేచి కస్సుమంటారెందులకో! (అది నిజమని వారొప్పుకోరని ఇక్కడున్నవారందరికి, వారిని కూడా కలుపుకుని, తెలుసుననుకోండి. అది వేరే విష్యం). వారిని ఏ సినిమా మాధ్యమంగా ఆ నట (పున్నమి) నాగు కరిచారో ఏమో, (ఈ నారసింహుల వారు ఆ మెగా నట సింహాలను ఎల్లా వేళల తొక్కి నారా తీస్తూనే ఉంటారు (అవునబ్బా ఇక్కడ నర అని కొడితే నారా అని ఒచ్చిందేంటబ్బా ! shall we truly call it a mere stretching of the word or a simple typo?) బహుశా వారు కోడెనాగు, శ్వేతనాగు లేక నందమూరి నాగులు లేక మరే ఏ ఇతర నట నాగుల అభిమానుల్లో అయుండొచ్చునని మా అనుమానం.
తొలగించండిఅదేంటో రెండెద్దుల వారు చిరు నామాన్ని స్మరించక మానరు, నరసింహుల వారు వేణు వెంటనే గర్జించక మానరు.
ప్చ్ప్చ్ ముందుగా వారికి, ఆపై 'మూగా'భి'మాను'లమైన మాకు ఎప్పటికో మనఃశాంతి? (అవునుగాని రెండెద్దుల వారూ మాకు గాని ఈ వ్యాఖ్య మూలకంగా "in front there is crocodile festival" గాని ఉండదు గదా?
Just :)
సరదా కోసమే కదా, ఏం కాదు లెండి?
తొలగించండిమంచి విశ్లేషణ . మనస్పూర్తిగా ఈ చిన్నవ్వాసానికి
రిప్లయితొలగించండిఒక ఉపాధ్యాయుడిగా *****(5)స్టార్స్ ఇచ్చేస్చున్నాను . ఐతే సారూ , మన బళ్లలో సార్లకు ఇంగ్సీషులో
బోధించడం రానే రాదు . మరెట్లా ?
శిక్షణలా , తూతూ మంత్రాలు . వాటివల్ల
తెగదుగాని , ఇంకోటేదైనా ఆలోచించాలి .
రాజకీయాలంటారా , వీళ్లు వాళ్లుగా ~ వాళ్లు
వీళ్సుగా మారకా పోరు , మాటలూ మారకాపోవు .
ఇంగ్లీషు మీడియంలో గవర్ణమెంటు బళ్లలో
జదువు సాగేదెలాగా ? పేదపిల్లలు చదూకునేదెలాగా ?
అనేదే మిలియన్ డాలర్ల సందేహం నాకు .
దీనికేదైనా మార్గం చూపిస్తే మీకు ఇంకో ఫైవ్ స్టార్స్ అదనంగా .
టీచర్స్ కి మరీ అంత గొప్ప ఇంగ్లీష్ అవసరం లేదండీ. పౌన పున్యం అని కాకుండా frequency అని భోదిస్తే చాలు.
తొలగించండితెలుగు మీడియం బాధితుల్లో నేనూ ఒకడిని. ఐ.ఐ.టి కి వెళ్ళాక అక్కడ అధ్యాపకులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్ధులు మాట్లాడే ఇంగ్లీషు అర్ధం కాక చాలా కష్టం గా ఉండేది. అదృష్టం కొద్దీ నా లాంటి వాళ్ళకి కాలేజి వాళ్ళు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించే వాళ్ళు. దాని సాయం తో గట్టెక్కాను.
రిప్లయితొలగించండిప్రభుత్వ నిర్ణయం స్వాగతించ తగ్గదే కానీ అధ్యాపకులకి ముందు ఇంగ్లీష్ లో బోధించడం నేర్పాలి కదా. మిగతా సబ్జెక్టుల మాట అటుంచి, సైన్సు, మేథ్స్ మాత్రమైనా ఇంగ్లీష్ బోధించేలా అధ్యాపకులకి శిక్షణ ఇవ్వాలి. ఈ రెండూ ఒకటి నుండి 6 వరకూ మొదట ఇంగ్లీష్ లో కి మార్చి, తర్వాత అంచెలు అంచెలు గా మొత్తం కొన్నేళ్ళలో మారిస్తే , ట్రాన్సిషను స్మూత్ గా ఉంటుంది, అటు విద్యార్ధులకీ, ఇటు ఉపాధ్యాయులకీ ఇబ్బంది లేకుండా ఉంటుంది.
మీది తెనాలే మాది తెనాలే అన్నమాట మాధవ్ గారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండితెలుగు మీడియంలో చదువుకున్న మాధవ్ గారు IITలో సీటు సంపాదించిన వైనం inspiring గా ఉంది. నాదొక సందేహం.... ప్రశ్నాపత్రాల్లో సాంకేతిక పదాలు ఇంగ్లీషులోనే ఉంటాయి కదా, మరి మాధవ్ గారికేమీ ఇబ్బందేమీ కలగలేదా? అయితే పోటీ పరీక్షల్లో విజయానికి తెలుగు మీడియం ఆటంకం కాదు అని ఇటువంటి success stories వల్ల అనుకోవచ్చా? (my genuine doubts)
తొలగించండినా కష్టం అంతా స్పోకెన్ ఇంగ్లీష్ వల్లనే ఉండేది. సాంకేతిక పదాలు, పరీక్ష వ్రాయడానికి సరిపడ ఇంగ్లీషు అప్పటికే పట్టుబడిందండి. వాడుక భాష లో ఏ పదాలు ఎప్పుడు ఎలా వాడాలి, భూత భవిష్యత్ వర్తమానాలూ, వొకాబ్యులరీ తెలియక పోవడం వల్ల చాలా అగచాట్లు పడాల్సి వచ్చేది. ఎర్రబస్సెక్కి వచ్చేసాడు అనే రేంజ్ లో చూసే వాళ్ళు ఇంగ్లీషు బాగా మాట్లాడగలిగిన తెలుగు వాళ్ళు కూడా.
తొలగించండిThanks Madhav గారు.
తొలగించండినా సందేహాన్ని నేను సరిగ్గా వ్రాయలేదనుకుంటాను. మీరు IITలో జేరిన తరువాతి పరిస్థితి గురించి కాదు నేనన్నది. సీటు రావాలంటే IIT Entrance Exam వ్రాయాలి కదా, అది ఇంగ్లీషులో ఉంటుంది కదా. తెలుగు మీడియంలో చదువుకున్నానన్నారు కదా మరి ఆ Entrance Examను ఎలా ఎదుర్కొన్నారు అని నా సందేహం. సరే, మీ ఇబ్బంది స్పోకెన్ ఇంగ్లీష్ తో మాత్రమేనంటున్నారుగా, so that's ok.
ఇంగ్లీష్ మీడీయం అంటే, టీచర్లు ఫారిన్ లాంగ్వేజ్ స్టైల్లో చెబుతారూ, పాపం పిల్లకాయలకి ఏమర్ధమైతది అని ఫీలయ్యే బేద్దమనుషులకి, క్లాసుల్లో తెలుగులోనే చెబుతారు. కాకపోతే, "హెచ్చవేస్తే".. బదులు "మల్టిప్లై చేస్తే..." లాగ చెబుతారు కాబట్టి పిల్లలకి బాగానే అర్ధమైతగానీ.. మీరంతా పవనుకల్యానులా బెంగేసుకోమాకండి.
రిప్లయితొలగించండిచిరు డ్రీమ్స్ గారు, బాగా చెప్పారు.
తొలగించండి>>గాంధీ ఎప్పుడూ పక్కింట్లోనే పుట్టాలి మనింట్లో కాదు అన్నది వీరి కోరిక
రిప్లయితొలగించండిగాంధీ కాదండీ భగత్ సింగ్. పక్కింటోడెప్పుడూ మనకోసమే ప్రాణాలర్పిస్తాడుగానీ, మన ఇంటోడుకాకూడదు అని చెప్పడమే దాని ఉద్దేశ్యం.
మా తెలుగు మేష్టారికి భగత్ సింగ్ కంటే గాంధీ విధానం నచ్చేది, అందుకే ఆయన ఎవరైనా ఏదైనా పని మొదలెట్టడానికి ఆలోచిస్తుంటే అలా అనేవారు. ఎంతసేపు వాడెవడో పని మొదలెడితే మనం వెనుక వెళదాం అని తప్పితే నువ్వే మొదలు పెట్టవు అని.
తొలగించండిగిరిధర్ పొట్టేపాళెం గారు తన బ్లాగ్ "My Soul On Canvas మనః ఫలకం" లో నిన్న (Nov 24, 2019) ఈ విషయం మీద "తెలుగు వెలుగు" అని ఒక పోస్ట్ వ్రాశారు👇. ఆసక్తికరంగా ఉంది. వీలయితే అందరూ చదవండి.
రిప్లయితొలగించండితెలుగు మీడియమా, ఇంగ్లిష్ మీడియమా?
నా బ్లాగ్ పోస్ట్ ని షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండీ!
తొలగించండిమీరు అన్యధా భావించలేదని ఆశిస్తాను గిరిధర్ గారూ.
తొలగించండిలేదండీ, మరింతమంది చదివి ఆలోచిస్తే మంచిదే కదా!
తొలగించండి