బ్లాక్ బస్టర్ కథల కోసమయితే బ్యాంకాక్ బీచ్ ల దాకా వెళ్ళాలేమో తెలీదు గానీ ఒక డీసెంట్ సినిమా తీయడానికైతే ఎక్కడికీ పోవలసిన అవసరం లేదు. మన జీవితంలో జరిగిన విషయాలో లేదంటే మన పక్కింట్లో చూసిన విషయాలో ఒక్కసారి నెమరేసుకొని ఒక చక్కటి కథని అల్లుకొని సినిమా తీయొచ్చని నేను ఈ వారం చూసిన టులెట్, ది గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమాలు గుర్తు చేస్తాయి.
మనం ఇల్లు మారే ప్రతీసారి పడే ఇబ్బందుల్ని లేదంటే ఉన్న ఫలంగా ఇంకో నెల రోజుల్లో బాడిగ ఇంటిని ఖాళీ చెయ్యమని ఇంటి ఓనర్ ఆజ్ఞ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంకో కొంప ఎలా వెతుక్కోవాలిరా భగవంతుడా అని మనకు ఎన్నోసార్లు అనిపించే ఉంటుంది. ఆ ఒక్క నెల టైం లో మన ఆర్ధిక స్థోమతకు సరిపడే ఇల్లు దొరకబుచ్చుకునేపాటికి తల ప్రాణం తోకకి వస్తుంది. ముఖ్యంగా 10 లేదంటే 12 నెలల అడ్వాన్స్ కట్టాలి అంటే మాత్రం భలే కష్టం. మీరు ఇళ్ళు ఖాళీ చేసిన తర్వాతే అడ్వాన్స్ ఇచ్చేది అని కనికరం లేని కొందరు ఇళ్ళ ఓనర్స్ మెలిక పెడతారు, మీరు అడ్వాన్స్ పూర్తిగా చెల్లిస్తే గానీ ఇంట్లో అడుగుపెట్టడానికి వీల్లేదు అని ఆ కొత్త ఇంటి ఓనర్ కండీషన్ పెడతాయి.
ఇలాంటివే ఒక 12-15 ఏళ్ళ క్రితం రెండు సంఘటనలు జరిగాయి నా జీవితంలో - ఒకటేమో బ్యాంకు స్టేట్మెంట్ ఇస్తే గానీ పాస్పోర్ట్ అప్లికేషన్ తీసుకోము అంటారు పాస్పోర్ట్ ఆఫీసులో, అడ్రస్ ప్రూఫ్ కోసం పాస్పోర్ట్ ఇస్తేనే బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేస్తాం అని బ్యాంకు లో అనేవారు. రెండోదేమో జాబ్ కావాలంటే ఎక్సపీరియెన్స్ అడిగేవారు, ఆ ఎక్సపీరియెన్స్ రావాలంటే ఎవరో ఒకరు ముందు మనకు జాబ్ ఇవ్వాలి. ఇలాంటి సిట్యుయేషన్స్ ని 'క్యాచ్ 22' అంటారనుకుంటాను ఇంగ్లీషులో.
అయినా పది పన్నెండు నెలల అడ్వాన్స్ ఇచ్చేటంత ఎక్స్ట్రా డబ్బు మధ్యతరగతి వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది? ఇక ఆ తిప్పలు మరీ దారుణం, నేనైతే ఆఫీసులో అడ్వాన్స్ కోసం అప్లై చేసుకోవడం లాంటి తిప్పలు పడాల్సి వచ్చేది. ఇక ఆ నెల దాటినా ఇల్లు దొరక్కపోతే, దొరికినా లాస్ట్ మినిట్ లో ఆ కొత్త ఇంటి ఓనర్ మొండి చెయ్యి చూపిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది దాదాపు ప్రతీ మధ్యతరగతి వ్యక్తీ అనుభవించే ఉంటాడు. కేవలం ఇలాంటి సన్నివేశాలతోనే సినిమాని తీసి మెప్పించారు టులెట్ అనబడే తమిళ్ సినిమాలో.
ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే దాకా ఇంటి పనులతో, వంటింటి పనులతో సతమతమయ్యే ఇల్లాలి బాధలను చూపించిన సినిమా ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అక్కడక్కడా వంటలు ఎలా వండాలో గిన్నెలు ఎలా తోమాలో నేర్పించే ప్రోగ్రాం లా ఈ సినిమా సీన్స్ అనిపిస్తాయి గానీ సినిమా అంతా చూసాక ఆ సీన్స్ అంత సేపు పెట్టడం వల్లే మనం ఆ హీరోయిన్ పాత్రను అంతగా ఓన్ చేసుకోగలిగాము అనిపిస్తుంది. ఓల్డ్ జెనరేషన్ లో మరీ దారుణంగా రోజంతా అలానే కష్టపడేవారు. అలాగని ఈ జెనెరేషన్ లో స్త్రీలు కష్టపడటంలేదు అని కాదు నా అభిప్రాయం. ఇప్పుడు కూడా అంతే కష్టపడుతున్నారు కాకపోతే భర్తల్లో కాస్త మార్పు వచ్చి వారు తమ భార్యలకి కాస్త చేదోడు వాదోడుగా ఉంటున్నారని నా అభిప్రాయం.
ఇక న్యూస్ పేపర్ లో వచ్చే వార్తలని చూసి కూడా ఒక కథను అల్లేసుకోవచ్చని నిరూపించిన సినిమా మలయాళంలో వచ్చిన 'హెలెన్' అనే సినిమా.
ఇవేమో ఈ నెలో, పోయిన నెలో రిలీజ్ అయినా సినిమాలు కాదు. నేను చూడ్డం బాగా ఆలస్యమైంది అంతే. అయినా నేనే చూశానంటే ఈ పాటికే చాలా మంది చూసి ఉంటారు గానీ, చూడని వారు ఎవరైనా ఉంటే ఈ వీకెండ్ లో వీటితో కాలక్షేపం చెయ్యొచ్చు.
To Let సినిమా బాగా తీశారు, తప్పక చూడండి అని మీకు సూచించిన వారిలో నేనూ ఒకడిని అని జ్ఞాపకం. మొత్తానికి చూశారన్నమాట, గుడ్.
రిప్లయితొలగించండికిచెన్ సినిమా గురించి అంత మంచి రివ్యూ ఏమీ తగలలేదు నాకు, అందువల్ల ఇప్పటి వరకు చూడలేదు. ఇక ఆ మలయాళ సినిమా “హెలెన్” గురించి ఇంతకు ముందు వినలేదు, బాగానే ఉన్నట్లనిపిస్తోంది, త్వరలో చూస్తాను, థాంక్స్.
మీరే అన్నమాట ఆ ఒక్కరూ, ఆ సినిమా పేరు చూసినప్పుడే ఈ సినిమా చూడమని ఎవరో చెప్పారని గుర్తు వచ్చింది గానీ మీరన్న విషయం గుర్తుకు రాలేదు మేష్టారు. సారీ for that and thanks for suggesting that మూవీ.
తొలగించండిఫరవాలేదు గానీ …. “హెలెన్” మూవీ చూసానండి (prime video లో) నిన్న. బాగుంది, బాగా తీశారు, ప్రస్తుత కాలపు మలయాళ చిత్రాల పేరు నిలబెట్టారు. యథార్థ సంఘటన అని చివర్లో చెప్పాడు. మంచి మూవీ పేరు చెప్పినందుకు మీకు కూడా థాంక్స్.
తొలగించండిమన రొటీన్ తెలుగు సినిమాలు చూసేకన్నా అప్పుడప్పుడు వెరైటీ స్టోరీస్ కోసం పక్క భాషల్లోకి తొంగి చూడటమే.
తొలగించండిరెండు సినిమాలు చూడలేదు. కానీ Great Indian Kitchen ఇటువంటి సినిమాలు ముందుగానే ఒక narrative తో తీస్తారు. పేరులోనే ఉంది . దాని మీద నేను వ్రాసిన పోస్టు ఇది https://sarachandrika.wordpress.com/2021/02/12/%e0%b0%b5%e0%b0%82%e0%b0%9f-%e0%b0%b5%e0%b0%82%e0%b0%9f%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81/
రిప్లయితొలగించండిబాగుంది మీ విశ్లేషణ చంద్రిక గారూ, socks కూడా భార్యలతో విప్పించుకుంటూ శని, ఆదివారాలు కూడా నీళ్ళు, కాఫీ, భోజనం కూర్చున్న కుర్చీ లోకే తెప్పించుకుని పూచిక పుల్ల కూడా కదపని భర్తలను కూడా చూశాను నేను రియల్ లైఫ్ లో, బహుశా అలాంటి వారి మీద తీసిన సినిమా అయి ఉండచ్చు.
తొలగించండి