అవునా, ఈ ఛార్జ్ తో అయితే నేను బెంగళూరు నుంచి మా ఊరికి వెళ్ళి రావచ్చేమో అన్నా.
సరే పద ట్రైన్ లేటయ్యింది, కాఫీ తెచ్చుకుందాం అని కాఫీ షాప్ లోనికి వెళ్ళగానే వాటర్ బాటిల్ మూత తీసి రెడీ గా పెట్టుకున్నాడు.
'ఇక్కడ కాఫీ రేట్ విని అదిరి పడతావనుకున్నానే? మామూలుగానే ఉన్నావ్?' అన్నాడు వాటర్ బాటిల్ మూత మూసేసి.
కాఫీ రేటు నాకు సిడ్నీ ఎయిర్పోర్ట్ లోనే షాకిచ్చింది కాబట్టి నేను ప్రిపేరయి ఉన్నాను. అయినా కాఫీకి నాలుగున్నర్ర డాలర్లు ఏమిటి?
'సిడ్నీ లో అంతే, సిడ్నీ లో అంతే' అన్నాడు రౌడీ అల్లుడులో అల్లు రామలింగయ్యలా. సరే ట్రైన్ రావడానికి ఇంకో 15 నిముషాలు ఉంది కదా పద ఇదే బిల్డింగ్ లో బ్యాంకు ఉంది, నువ్వు అకౌంట్ ఓపెన్ చేద్దువు గానీ అన్నాడు.
వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా నిజంగానే పదంటే పదే నిముషాల్లో అకౌంట్ ఓపెన్ చేశాను బ్యాంకు లో. ఆస్ట్రేలియా స్వర్గం కాకపోయినా నరకం అయితే కాదని తెలియజేయడానికి గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది.
నేను చదువుకోవడానికి తిరుపతికి వెళ్ళినప్పుడు మొదటి సారి అకౌంట్ ఓపెన్ చేయడానికి బాంక్ కి వెళ్ళా. అంతవరకూ జీవితం లో ఒంటరిగా బ్యాంకు లోకి వెళ్లాల్సిన అవసరం లేకపోయింది. నాన్న బ్యాంకు ఉద్యోగి అవడం వల్ల నా సంతకం చేయడం తప్ప బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడంలో ఏ కష్టం కలగలేదు.
హౌ కెన్ ఐ హెల్ప్ యు? అంది కౌంటర్ లోపల కూర్చున్న ఒక అమ్మాయి. నేమ్ ప్లేట్ మీద 'మల్లీశ్వరి, క్లర్క్' అని రాసుంది.
'మీ బాంక్ లో ఒక అకౌంట్ ఓపెన్ చేద్దామనుకున్నా' అన్నాను.
'ఏదీ మీ చేతులు ఒకసారి చూపించండి' అంది.
నా చేతిలో ఏముంటుందండీ ఒట్టి గీతలు తప్ప అన్నాను.
అహ, చేతికి ఉంగరాలు గట్రా ఏమన్నా ఉన్నయోమేనని అంది.
తాడు బొంగరం లేని వాడిని నా వేళ్ళ కెందుకు ఉంటాయి ఉంగరాలు, మీరు మరీనూ.
బొంగరం ఏమిటి, ఉంగరం కూడా కొని పెడతారు పెళ్లి చేసుకుంటే అంది.
ఆ టైం నాకింకా రాలేదు లెండి అన్నాను.
కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు. ఏ క్లర్కో మీతో కళ్యాణం కోసం పుట్టే ఉంటుంది లెండి. 'జస్ట్ రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు ఇవ్వండి, ఓపెన్ చేద్దాం' అంది ఉత్సాహంగా.
ఇవిగోండి అని పర్సు ఓపెన్ చేసి ఇవ్వబోతుంటే అందులోనుంచి ఒక అమ్మాయి ఫోటో బయట పడింది. దాన్ని నేను తనకి కనపడకుండా దాచడానికి ప్రయత్నించేలోగా...
"నిన్ను ఇంట్రడ్యూస్ చేయడానికి ఒకర్ని తీసుకురా అలాగే నీ ఓటర్ కార్డు, మీ ఆస్తి పత్రాలు, మీ ఇంటి అటక మీదుండే తాళ పత్రాలు, మీ గుమ్మానికి కట్టిన మామిడాకులు, మీ అవ్వ కొంగులో చుట్టి పెట్టుకున్న తమలపాకులు, మీ వంటింటి డబ్బాలో ఉన్న పూతరేకులు, మీ పెరట్లో కాసిన మామిడాకులు, మీ వీధి చివర కుప్పతొట్టి లో పారేసిన ఇస్తరాకుల తో పాటు నీ వేలి ముద్రలు, కాలి ముద్రలు పట్రా.... వచ్చేశాడు ఉట్టి తలకాయ ముద్రలు తీసుకొని" అంది మల్లీశ్వరి కాస్తా ఎల్లారీశ్వరి రేంజ్ లో గొంతు పెంచి కోపంగా.
కిసుక్కున నవ్వి బ్యాగులోంచి పెన్ను పేపర్ తీసుకొని సీరియస్ గా రాసుకోవడం మొదలుపెట్టాడు అక్కడే ఒక టేబుల్ మీద కూర్చొని ఉన్న ఒక గెడ్డం అతను.
అటు చూస్తావేం, నేను చెప్పిన వాటిని తీసుకొని రా అలాగే నిన్ను ఇంట్రడ్యూస్ చేయడానికి ఒకర్ని తీసుకురా.
సత్యనారాయణో, రాఘవేంద్ర రావో లేదంటే జగన్నాథ్ గారినో అడగాలి మరి అన్నాను నేను ఆలోచిస్తూ.
వాళ్లెవరు? ఈ బ్యాంకు లో వాళ్ళకు అకౌంట్ ఉందా?
ఉండకపోవచ్చు గానీ పవన్ , మహేష్, పునీత్ లని వాళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు.
వాళ్లెవరు, మీ రూంమేట్సా?
అయితే బాగుండు. పవన్, మహేష్ తెలుగు సినిమా స్టార్స్, మరి పునీతేమో పూరి జగన్నాథ్ 'అప్పు' సినిమా తో ఇంట్రడ్యూస్ చేసిన కన్నడ సినిమా స్టార్
నువ్వేమయిన స్టార్ కొడుకువి అనుకుంటున్నావా ఇంట్రడ్యూస్ చేయడానికి, ఇంట్రడ్యూస్ చేయడమంటే ఈ బ్యాంకు లో అకౌంట్ ఉన్నవాళ్ళు నువ్వు తెలుసని చెప్పడం.
గోవిందా! గోవిందా!, నా డబ్బులు నేను బ్యాంకులో దాచుకోవడానికి కూడా ఇంత శ్రమ పడాలా అని తూర్పు తిరిగి ఆ ఏడు కొండల వాడికి దండం పెట్టి అక్కడి నుంచి బయలుదేరాను.
కానీ ఇన్నేళ్లయినా ఆ గెడ్డం ఉండే ఆయన అంత అర్జెంట్ గా పెన్ను పేపర్ వెతుక్కొని ఏం రాసుకున్నాడో నాకు అర్థం కావడం లేదు, మీకేమైనా అతనెవరో, ఎందుకలా చేశాడో తట్టింటే కాస్త చెప్పరూ ప్లీజ్.
// “ ఏ క్లర్కో మీతో కళ్యాణం కోసం పుట్టే ఉంటుంది లెండి.” //
రిప్లయితొలగించండిఅర్థం కాలేదా, మీరేమైనా ప్రొపోజ్ చేస్తారేమోనని ఆశ పడిందేమో పాపం, పవన్ కుమారా? కొత్త “మల్లీశ్వరి” సినిమాలో వెంకటేష్ లాగా ఆవిడ కాళ్ళకు మెట్టెలున్నాయేమో ఓసారి చూడకపోయారా 😁?
డాలర్లలో ఉండే ధరల్ని రూపాయల్లోకి మార్చుకుని చూస్తే ఏమీ తినలేరు, తాగలేరు అన్న సత్యాన్ని మరచిపోతే ఎలా, “పడమటి సంధ్యారాగం” సినిమాలో పెద్దాయన శాస్త్రి గారిలాగా (విజయశాంతి తండ్రి పాత్ర) 🙂 ?
అయినా ఆస్ట్రేలియా విశేషాలు చెబుతానని మొదలు పెట్టి మళ్ళీ మన దేశానికి వచ్చారేమిటి, మా బ్యాంకుల మీద పడతారేమిటి, ఆఁయ్ ?
నాదంతా ఆవు మీద వ్యాసం లాంటి కథే కదా మేష్టారు, తెలిసిందే రాసేయడం, ఏది గుర్తుకొస్తే అది కలిపేయడం.
తొలగించండిఅవును, డాలర్లన్న మాటే కానీ దానికి తగ్గ ఖర్చే.
నేనన్నదీ అదే. ఎక్కడి ఖర్చులు అక్కడుంటాయి - రూపాయలవనీండి, డాలర్లవనీండి, పౌండ్లవనీండి. తమ దేశం దాటితేనే వాటి మారకపు విలువ మారుతుంది.
తొలగించండికానీ సిడ్నీ బాగా ఖరీదైన ప్రదేశం మేష్టారు. అదే Melbourne వైపు వెళ్తే ఖర్చులు బాగా తక్కువ. కానీ ఆస్ట్రేలియా కంటే అమెరికా లో డబ్బులు ఎక్కువ మిగుల్చుకోవచ్చని ఉవాచ.
తొలగించండిఆ గడ్డం ఆయన మిమ్మల్ని బ్యాంకుకి ఇంట్రడ్యూస్ చెయ్యటానికి రెడీ గ ఉన్నాడు. మీరడిగితే కొంచెం ఫీజిస్తే .
రిప్లయితొలగించండిఅయ్యో, మిస్ అయ్యనన్నమాట లక్కరాజు గారు.
తొలగించండిఅదీ అయ్యుండచ్చండోయ్, లక్కరాజు వారూ . బాగా పట్టేశారు మీరు 👌.
రిప్లయితొలగించండి🙂🙂
మేష్టారు, ఈ మధ్య జై గారు బ్లాగ్స్ వైపు రావట్లేదా ఏమిటి? వారూ తరచుగా కామెంట్స్ చేస్తూ ప్రోత్సహించే వారు.మీరు సీనియర్స్ కదా ఈ బ్లాగ్ లోకంలో జై గారి గురించి మీకు తెలిసి ఉంటుందని అడిగాను.
తొలగించండిజై గారి గురించిన సమాచారం 👇
తొలగించండిhttps://syamaliyam.blogspot.com/2021/08/blog-post_70.html?m=0
మరీ ఇలాంటి వార్తను చదవాల్సి వస్తుందనుకోలేదు మేస్టారు. నిజంగా విషాదకరం. వారి ఆత్మ శాంతించుగాక.
తొలగించండిఆ గెడ్డం ఆయనకి ఇది అలవాటే. అన్నీ కాపీ కథలు, కాపీ సీన్లు..
రిప్లయితొలగించండిమొదట్లో కాస్త సొంతంగా ఆలోచించేవారెమో, ఆ తర్వాత ఆయన ఆలోచనలు ఆవిరి అయ్యాక కాపీని నమ్ముకున్నట్లు ఉన్నారు బోనగిరి గారు.
తొలగించండిఎవరూ??
తొలగించండిఅయినా ఈ రోజుల్లో గెడ్డం పెంచనివారెవరండీ - అందులోనూ సినిమారంగంలోను, క్రికెట్ జట్టులోనూ? చాలా మటుకు గెడ్డాలు, అరగుండ్లు.
అల వైకుంఠపురం, అత్తారింటి దారేది అను ఎందుకు హిట్టు అయ్యాయో తెలియని చిత్రాలు, అజ్ఞాతవాసి లాంటి అర్థం పర్థం లేని సినిమాలు తీసిన అతడే.
తొలగించండిఓహో, వారా? వారికి మాంత్రికుడు లాంటి బిరుదేదో ఉందనుకుంటానే?
తొలగించండికొత్త “మల్లీశ్వరి” సినిమా కథ కొంతవరకు అలనాటి Roman Holiday సినిమాను పోలి ఉంటుందని తెలిసినదే.
ఆ సినిమాకి కథ, మాటలు ఈ మాంత్రికుడివే.
తొలగించండిఏమిటి పవన్ కుమార్, మీ దేశంలో భూకంపం వచ్చిందటగా? ఎల్లరును క్షేమమే కదా?
రిప్లయితొలగించండిప్రస్తుతానికైతే మా పక్క రాష్ట్రంలో వచ్చింది మేష్టారు, మాకైతే రాలేదు. Thanks మేష్టారు.
తొలగించండి