5, జులై 2022, మంగళవారం

నిన్నా మొన్నటి సినిమా కబుర్లు

హీరో రవితేజ ఏజ్ కి బచ్చన్ ఫ్యాన్ అంటే ఓకే గానీ పూరీ ఆకాష్ ఏజ్ కి బచ్చన్ ఫ్యాన్  ఏమిటో?? బచ్చన్ , షారుక్ వీళ్లంతా ఎప్పుడో అవుట్ డేటెడ్  అయిపోయారు అని ఆ డైరెక్టర్ అప్డేట్ అవ్వకుండా లేదంటే పదేళ్ళ క్రితమెప్పుడో రాసుకున్న కథతో జార్జి రెడ్డి లాంటి అంతో ఇంతో మంచి సినిమా తీసిన డైరెక్టర్  'చోర్ బజార్'  అనే సినిమా తీస్తే అది 'బోర్ బజార్' అని చూసిన అతి కొద్దిమంది ప్రేక్షకులు తీర్పు ఇచ్చేశారు. బచ్చన్ గారు ఉండీ కూడా  సైరా కి ఒక్క వంద టికెట్స్ కూడా సరిగ్గా తెగినట్లు లేవు బాలీవుడ్ లో. ఇంకా బచ్చన్, చిరంజీవి అంటూ ఉంటే ఎలా?

హీరోల కొడుకులు హీరోలుగా క్లిక్ అవుతున్నారు కానీ డైరెక్టర్స్ కొడుకులు హీరోలుగా నిలబడలేక పోయారు, కారణం కొడుకులు హీరోగా ఎంట్రీ ఇచ్చే సమయానికి ఆ డైరెక్టర్స్ డైరెక్షన్ గేట్ ఎగ్జిట్ దగ్గరికి చేరటమే కారణం. 

కోదండరామిరెడ్డి, రాఘవేంద్ర రావు, దాసరి నారాయణ రావు, ఈవీవీ సత్యనారాయణ ఇలా చాలా మంది దర్శకులు వారి బిడ్డల్ని స్టార్స్ చేయలేకపోయారు. పూరీ జగన్నాథ్ కూడా ఆ కోవలోకే చెందుతాడేమో. 

గాలి నాగేశ్వర రావు అనే సినిమా కి జిన్నా అని పేరు మార్చారు. గాలి నాగేశ్వర రావు షార్ట్ కట్ లో జిన్నా అవుతుందని వాళ్లకు ఎలా అనిపించిందో. ఏదో ఒక కాంట్రవర్సీ చేసి జనాలకు సినిమాని దగ్గర చెయ్యాలని చూస్తున్నట్లు ఉంది గానీ అశోక వనంలో అర్జున కళ్యాణం విషయంలో ఇలాంటి పప్పులు ఉడకలేదని తెలియదేమో ఈ జిన్నా మేకర్స్ కి.  నిన్నా, ఇవాళ సిగరెట్ తాగుతున్న కాళికా పోస్టర్ కూడా ఈ పైత్యానికి సంబంధించినదే. 

సినిమాలను రెండు మూడు వారాలకే ఓ.టి.టి కి ఇవ్వడం వల్ల థియేటర్స్ కి జనాలు రావడం లేదని భ్రమపడి సినిమా రిలీజ్ పూర్తి అయిన ఏడు వారాల వరకూ ఓ.టి.టి కి ఇవ్వకూడదు అని నిర్మాతల మండలి (ఇదసలు ఉందో లేదో తెలీదు కానీ అప్పుడప్పుడూ ఈ పేరు వినపడుతూ ఉంటుంది, ఆటలో అరటిపండు లాగా అన్నమాట) తీర్మానించిందట. తొక్కలో సినిమా కోసం ఓ 50 రోజులు ఆగలేమా అనుకునే జనాలే  ముప్పాతిక శాతం మంది ఉంటారు అన్న విషయం మర్చిపోయారేమో మరి. 

ఒక్క సినిమా ఘోరంగా విఫలమయ్యాక, 150 సినిమాల విషయంలో గుర్తురాని న్యూమరాలజీ ఇప్పుడు గుర్తుకొచ్చి తన పేరులో మరో 'E' చేర్చుకున్నారని అందరూ అంటుంటే లేదు లేదు అది ఎడిటింగ్ లో జరిగిన లోపమని సరిపెట్టుకున్నారు ఒక జీవి. 

ఒకానొక అవార్డు విన్నర్, RRR సినిమాని గే సినిమా అన్నారని ఆయన పేరు లోని బూతు పదాన్ని హైలైట్ చేస్తూ ట్వీట్ చేశారొక సంగీత జ్ఞాని. 

అల్లూరిని ఈ మాత్రమైనా జనాలు గుర్తుంచుకునేలా చేసిన ఆ స్టార్ ని కాకుండా మరో స్టార్ ని అల్లూరి విగ్రహావిష్కరణ కి ఆహ్వానించారని మండిపడుతున్న ఒక వర్గం. 

ఎవడి పెళ్ళాం ఎవరో, ఎవడి మొగుడు ఎవురో అర్థం కాక మాజీ మొగుడు, మాజీ పెళ్ళాం, తాజా పెళ్ళాం, తాజా మొగుడు అని జుట్టు పీక్కుంటూ రోడ్డుకెక్కుతున్న ఈ రోజుల్లో కూడా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో తెలియని సినిమా తర్వాత "నిన్న ఒరు తమిళ్ పడం సూస్తిమి కదా, అదు నేను హీరోగా నీ డైరచ్చన్ లో రీమేక్ సేస్తుమా" అని ఓ అన్యోన్య జంట ముచ్చటించుకుంటున్నట్లు సమాచారం. 

4 కామెంట్‌లు:

  1. “ అల్లూరిని ఈ మాత్రమైనా జనాలు గుర్తుంచుకునేలా చేసిన ఆ స్టార్ ని కాకుండా మరో స్టార్ ని అల్లూరి విగ్రహావిష్కరణ కి ఆహ్వానించారని మండిపడుతున్న ఒక వర్గం. “ - I also felt the same way. They should have invited and felicitated Superstar Krishna gaaru.

    రిప్లయితొలగించండి
  2. మహా స్టార్ గారి రెండవ కూతురు మూడవ వివాహం అంట!
    ఇది వాళ్ళ వ్యక్తిగత విషయమే అయినా వినడానికి అదోలా ఉంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కాలం ఎటుపోతుందో ఇక పైన మరి, ఇంకా ఎలాంటివి చూడాల్సి వస్తుందో బోనగిరి గారూ .పెద్ద స్టేజ్ లో ఉన్న వారి వ్యక్తిగత విషయాలకు సామాన్య జనం అట్ట్రాక్ట్ అయి ఆ పద్ధతినే ఫాలో అయ్యే ప్రమాదం ఉంది.

      తొలగించండి