ఇది ఆస్ట్రేలియా ఏమీ స్వర్గం కాదు - 5 కి కొనసాగింపు
ఆఫీస్ కి వెళ్ళే హడావిడిలో ఉంటే డోర్ ఎవరో కొడుతున్నట్లు శబ్దం వచ్చింది.
ఓపెన్ చేసి చూస్తే ఇంగ్లీష్ బామ్మ, ఆవిడ తలుపు తట్టిందంటే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే. ఎప్పుడూ ఏదో ఒక రగడ చేస్తుంది వచ్చిందంటే.
మీ బాల్కనీ లో బట్టలు ఆరేశారు అంది
ఇది కొత్తగా వచ్చిన మా ముఖేష్ పనే అని అర్థమైంది మాకు.
ఈ సారికి మమ్మల్ని ఒగ్గెయ్యవే బామ్మ అని కాళ్ళు చేతులు పట్టుకొని బతిమలాడితే "కొత్తవాడు తెలియదు అన్నారు కాబట్టి వదిలేస్తున్నా" అంది
బాబూ ముఖేషూ, బాల్కనీ లో బట్టలు ఆరేయద్దు. 250 డాలర్ల దాకా ఫైన్ వేస్తారు అన్నాను.
ఎందుకలా?
బాల్కనీ లో బట్టలు ఆరేస్తే , బిల్డింగ్ బ్యూటీ దెబ్బతింటుందని ఇక్కడి వారి బోడి ఫీలింగ్.
అవును మరి ఇదో ఓపెరా హౌస్ లేదంటే తాజ్ మహల్ మరి, కనీసం మా ఊరిలో పాడు బడ్డ రాయల్ టాకీస్ లా కూడా లేదు అన్నాడు.
అవుననుకో, కానీ ఇక్కడ రూల్స్ అలా ఉన్నాయి మరి. మన బాల్కనీ అటు మెయిన్రోడ్ వైపుకు వస్తుంది కాబట్టి ఆరేయకూడదు.
అయినా నేను ఆరేసింది బాల్కనీ గోడలమీద కాదు కదా, బాల్కనీలో ఉన్న మన చైర్స్ మీదే కదా!
మన బాల్కనీ ఎవరికీ కనపడకుండా రోడ్డుకు వెనుక వైపు ఉంటే ఆరేసుకోవచ్చు. లేదంటే అది కూడా తప్పే అన్నాను.
********************
బుధవారం సాయంత్రం రూమ్ కి వచ్చేసరికి కిచెన్ లో కాస్త బ్యాడ్ స్మెల్ వస్తున్నట్లు అనిపించింది. ఏమిట్రా అని అన్ని గిన్నెలు వెదికితే విరిగిపోయిన పాలు కనిపించాయి ఒక గిన్నెలో.
"నేనే పాలల్లో తోడు వేశా పెరుగు కోసం" అన్నాడు మా ముఖేష్.
ఈ చలికి అంత ఈజీగా పెరుగు తోడుకోదు, మైక్రోవోవెన్ లో ఉంచు లేదంటే రెండు రోజులైనా పేరుకోక ఇలా బాడ్ స్మెల్ వస్తుంది. మన రూమ్ పక్కన ఉండే షాప్ లో కొను ఈ ఇబ్బందులు పడకుండా అన్నాను.
వాడి దగ్గర పెరుగు లేదు అన్నాడు.
వాడి దగ్గర ఉంటుందే, నేను ఎప్పుడూ అక్కడే తెచ్చుకుంటా.
అదేంటి? మరి వాడు నేను అడిగితే తెలీదు, లేదు అన్నాడే?
నువ్వేం అడిగావు?
కర్డ్ అని అడిగా.
ఈ సారి వెళ్ళినప్పుడు యోగర్ట్ అని అడుగు ఇస్తారు, వీళ్ళు కర్డ్ అనే మాట వాడరు అన్నాను.
******************
మరుసటి రోజు ఇవాళ చికెన్ చేసుకుందాం అని చికెన్ షాప్ కి పట్టుకెళ్ళాడు.
కిలో చికెన్ అడిగితే షాప్ వాడు ఫ్రిడ్జ్ లోంచి తీసి ఇచ్చాడు.
మనూర్లో అయితే చక్కగా అప్పటికప్పుడు మన కళ్ళ ముందు కోసి ఇస్తే గానీ తీసుకోము అలాంటిది వీడేంటి నిన్నో మొన్నో ఫ్రిడ్జ్ లో పెట్టినది తీసి ఇస్తున్నాడు.
నిన్నో మొన్నో కాదు ప్రతీ శుక్రవారం స్టాక్ వస్తుంది
అంటే ఈ రోజు గురువారం, అంటే 6 వ రోజు అన్నమాట
అవును స్టాక్ వచ్చి 6 రోజులు అంతే, కోసిన తర్వాత రెండు రోజులు warehouse లో ఉంచిన తర్వాతే ఇలా షాప్ కి పంపిస్తారు రూల్ ప్రకారం.
ఇవెక్కడి రూల్స్ రా బాబూ, మనూర్లో ఉదయం కోసిన చికెన్ మధ్యాహ్నం ఇస్తేనే ఒప్పుకోము.
అవును ఇక్కడ అంతే. ఈ సారి శుక్రవారం ఈవెనింగ్ లేదంటే ఆదివారం వచ్చి కొను అన్నాను.
సర్లే చికెన్ అప్పుడే కొంటా, అయినా ఈ చికెన్ తినడానికా ఆస్ట్రేలియా వచ్చింది, ఇవి కాదురా అబ్బాయ్ .. ఇక్కడ కంగారు, క్రొకోడైల్ మాంసం దొరుకుతాయట? ఎక్కడ అన్నాడు.
కంగారు అంటే మనకు ఇంగ్లీష్ తెలియదనుకుంటారు, దాన్ని కేంగరు అని ఒక రకంగా పలకాలి. అయినా వాటిని కూడా వదిలిపెట్టవా?
తినేప్పుడు కోడి అయితేనేం క్రొకోడైల్ అయితేనేం పద ఆ షాప్ చూపించు అన్నాడు.
అక్కడ అరకిలో క్రొకోడైల్ మాంసం కొని రూమ్ కి వెళ్ళాం కానీ ఆ రోజు రాత్రి జరగబోయే క్రొకోడైల్ ఫెస్టివల్ (ఉపద్రవం) ఊహించలేకపోయాం.
ఆస్ట్రేలియా ఏమీ స్వర్గం కాదని తెలిసి పోయింది లెండి నిన్న. పబ్లిక్ మీద కాల్పులు జరిపే ఉన్మాదులు మీ దేశం లోకి (రాజధాని నగరంలోకి) కూడా ప్రవేశించారట కదా - టీవీ వార్తల్లో చెప్పారు.
రిప్లయితొలగించండిబాల్కనీలో బట్టలు ఆరెయ్యకూడదు, బిల్డింగ్ “అందం” చెడిపోతుంది అనే పిచ్చి ఆలోచనలు, నిబంధనలు భారతదేశంలోకి కూడా వచ్చాయి లెండి. సో కాల్డ్ గేటెడ్ కమ్యూనిటీల్లో ఇటువంటి వెర్రిమొర్రి ఇంపోర్టెడ్ రూల్స్ పెట్టి మెయిన్-టెనెన్స్ ఆఫీసు వాళ్ళు వీరంగం వేసేస్తున్మారు.
అవునండీ, నిజంగానే మొసలి మాంసం తింటారా / అమ్ముతారా మీ దేశంలో ? కాదే జంతువూ తినడానికనర్హం అంటారా?
అవును మేష్టారూ, ఇలాంటి నేరాలు అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటాయి. మాఫియా సినిమాల్లో చూపించినట్లు ఆ మధ్య నడి రోడ్డు మీద గన్స్ తో ఎటాక్ చేసి ప్రత్యర్థి వర్గం అయిన తండ్రీ కొడుకులని చంపేశారు.
తొలగించండిలక్కీ గా నేను ఇప్పుడు ఉంటున్న అపార్ట్మెంట్ బాల్కనీ రోడ్ వైపు లేదు.
ఇండియా లో కూడా వచ్చేశాయన్నట ఈ తింగరి పద్ధతులన్నీ, అయితే ఇప్పుడు ఇండియా అభివృద్ధి చెందిన దేశం అన్నమాట.
ఇక్కడ ఏదీ వదిలే ప్రసక్తే లేదు మేష్టారు, జాతీయ జంతువు తో సహా.
చికెన్, లాంబ్, ఫిష్ తినే నేనే కొన్ని సార్లు ఆఫీస్ పార్టీ లో తినడానికి ఏమీ దొరక్క ఇంటికివచ్చి తిన్న రోజులు ఉన్నాయంటే నమ్మండి.