26, ఆగస్టు 2022, శుక్రవారం

లైగర్ - పూరీ పగిలిందట

బద్రి, ఇడియట్, పోకిరి , బిజినెస్ మాన్, ఇస్మార్ట్ శంకర్ లాంటి పనికి మాలిన సినిమాలను రిజెక్ట్  చేయకపోవడం వల్ల వచ్చిన ఖర్మ ఇది. ఇడియట్, పోకిరి లాంటి సినిమాలు హిట్టయి ఉండచ్చు, ఎక్కువ మంది ఆడియెన్స్ కి నచ్చి ఉండచ్చు గానీ వాటికంటే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అతడు (ఇది వేరే డైరెక్టర్  సినిమా, కాకపోతే పోకిరి ముందు వచ్చిన సినిమా) లాంటి సినిమాలు బాగుంటాయి.  

యేవో నాలుగు పంచ్ డైలాగ్స్, రెండు మెట్ట వేదాంతాలు, శృతి మించిన హీరోయిజం అతని సినిమాలో వాడేసి హిట్ అని అనిపించుకుంటాడు గానీ చాలా వరకు అతని సినిమాల్లో మొదటి నుంచి  విషయం తక్కువే. కొన్ని సినిమాల్లో అయితే హీరోయిన్ అనే పదార్థానికి చీము నెత్తురు, రోషం పౌరుషం, సిగ్గు షరం, మానం మర్యాద లాంటివేవీ ఉండవన్నట్లు కారక్టరైజెషన్ పెడతాడు. 

ఫేస్బుక్, వాట్స్ అప్ లలో వచ్చే కోట్స్ కి ఆయన తన స్టైల్ కోటింగ్ ఇచ్చి ఆ మధ్య musings మొదలు పెట్టాడు. శంఖం లో పోస్తేనే తీర్థం అన్నట్లు సెలబ్రిటీ నోటి నుంచి వచ్చాయి కాబట్టి అవి బాగా క్లిక్ అయినట్లున్నాయి. అది చూసి కొందరు వాతలు కూడా పెట్టుకున్నట్లు ఉన్నారు. 

పూరి గారికి టాలెంట్ ఉంది. అది కాదనే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు ఎందుకంటే ఆయన సినిమాలు చెప్పాయి  ఆయన టాలెంట్ ఏంటో. సినిమా జనాలు ఆహా ఓహో అని ఆయన్ను తెగ పొగిడేస్తూ ఉంటారు మీరు అది సర్ ఇది సర్ అని, వాళ్ళందరినీ కాస్త దూరం పెట్టి జాగ్రత్త తో పొలోమని పాన్ ఇండియన్ సినిమా అని ఇంకొకరి లాగా తాను కూడా పాన్ ఇండియా డైరెక్టర్ కావాలని వాతలు పెట్టుకోవడం మానేస్తే మంచిది.  

ఈ లైగర్ సినిమా ప్లాప్ వల్ల అనసూయతో పాటు మెగాస్టార్ ఫాన్స్ సంతోషంతో చంకలు గుద్దుకొని "కర్మ సిద్ధాంతాన్ని" ప్రచారం చేస్తున్నారు. అనసూయ కి విజయ్ దేవరకొండ కి మధ్య అప్పుడెప్పుడో అర్జున్ రెడ్డి సినిమా టైములో జరిగిన గొడవలు కారణం అయితే, అప్పట్లో "ఆటో జానీ" సినిమా సెకండ్ పార్ట్ నచ్చలేదని చిరంజీవి ఆ సినిమా చేయకుండా "బ్రూస్ లీ" అనే కళాఖండం లో గెస్ట్ రోల్ చేస్తే అది తుస్సుమన్నప్పుడు చార్మీ సంతోషపడుతూ ట్వీట్స్ చేయడం మరొక కారణం .   

ఒకప్పుడు ఫలానా హోటల్ లో పూరి బాగుంటుంది అని ఎగబడి తింటున్న జనాన్ని చూసి, ఎలాగూ ఇక వస్తూనే ఉంటారులే అని ఆ హోటల్ ఓనర్ పదేళ్ళ క్రితమే పెద్ద మొత్తంలో పిండికలిపి పెట్టుకుని ఇప్పటికీ  అదే పిండితోనే పూరీలు చేసి వడ్డిస్తున్నాడు.ఈ మధ్య వాటికి పాచి కంపు మొదలయ్యేసరికి కస్టమర్లు ఆ సద్ది పూరీలు తినలేక కొద్ది కొద్దిగా రావడం తగ్గించేశారు. 

కాబట్టి కాస్తో కూస్తో పూరి అభిమానిగా నా ఆశ ఏమిటంటే తన హోటల్ లో జనాలు పూర్తిగా  కనుమరుగయ్యే లోపు ఆ పాత పిండిని పారేసి కొత్త పిండిని కలుపుకుంటే మంచిది లేదంటే ఇక తన గురువు గారి లాగా కొట్టు మూసేసి షెడ్డు దారి పట్టడమే.  

4 కామెంట్‌లు:

  1. అసలే పూరి జగన్నాథ్,
    ఆపై విజయ్ దేవరకొండ...
    ఇంక చూసుకోండి, ఎన్ని విపరీతాలు ఉంటాయో!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విజయ్ దేవరకొండ ఒక రకంగా పవన్ కళ్యాణ్ టైపు. ఏమీ రాకపోయినా ఆ ఫేమ్ సంపాదించుకున్నారు. పూరి జగన్నాథ్ తో కలిసి ఆ వచ్చిన ఫేమ్ కూడా పోగొట్టుకుంటాడు అంతే.

      తొలగించండి
  2. పూరి జగన్నాథ్ సినిమాలలో స్త్రీల పాత్రలను చాలా అవమానకరంగా అసభ్యంగా చిత్రీకరిస్తాడు. పనికిమాలిన పొగరుబోతు హీరోలు హీరోయిన్ లను వేధించడం, తిట్టడం, అవమానించడం -- He glorifies stalking, teasing, abusing, insulting women in his movies. Really perplexing how censor board is approving such movies.
    . రామ్ గోపాల్ వర్మ పూరి జగన్నాథ్ తెలుగు సినిమాలకు పట్టిన పీడలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నూటికి నూరు పాళ్ళు నిజం. హీరో కి తప్ప హీరోయిన్ పాత్ర కి అస్సలు వేల్యూ ఉండదు. రాజమౌళి సినిమాల్లో కూడా.

      తొలగించండి