18, జులై 2021, ఆదివారం

4 వ వారం లాక్డౌన్

సిడ్నీలో ఈ రోజుతో COVID సెకండ్ వేవ్ 4 వ వారం లాక్డౌన్ లోకి అడుగుపెడుతున్నాం. 3 వారాలుగా ఇంట్లోనే ఉండి జనాలకి పిచ్చెక్కిపోతోంది, సరైన కారణం లేకుండా రోడ్ల మీద కనపడితే భారీగా ఫైన్స్ వేస్తున్నారు. ఉద్యోగాలు లేక చాలా మంది అవస్థలు పడుతున్నారు. 

సర్దార్జీ ల మీద ఎన్ని సిల్లీ జోకులు వేసినా 'పండ్లున్న చెట్లకే రాళ్ళ దెబ్బలు' అని నిరూపిస్తూ ఎప్పటికప్పుడు వారికి తోచిన సాయం చేస్తున్నారు. కొంతమంది సర్దార్జీ లు ఒక గ్రూప్ గా ఫార్మ్ అయి ఇబ్బందుల్లో ఉన్నవారు అడగవలిసిన అవసరం లేదు, మీరే వచ్చి మీక్కావలసిన సరుకులు తీసుకెళ్లండి అని ఒక ట్రక్ లో బియ్యం, బ్రెడ్ లాంటి నిత్యావసరాలన్నీ ఒక పెద్ద ట్రక్ లో ఉంచుతున్నారు. అంతే కాదు వంట వండుకోలేని స్టూడెంట్స్ లాంటి వారికి ఉపయోగకరంగా ఉంటుందని టేక్ అవే ఫ్రీ మీల్స్ కూడా ఏర్పాటు చేశారు. అందుకే కదా సింగ్ ఈజ్ కింగ్ అన్నారు. 

ఇబ్బందుల్లో ఉన్న వారికి, జాబ్స్ పోయినవారికి సోషల్ సెక్యూటరీ కింద నెలకు కొంత అమౌంట్ గవెర్నమెంట్ వారి ఖాతాల్లో జమ చేస్తోంది. 

పిల్లలతో, ఆఫీస్ వర్క్స్ తో పిచ్చెక్కే ఎంప్లాయిస్ కి రిలీఫ్ కోసం కంపెనీలు ఆన్లైన్ కౌన్సిలింగ్ గట్రాలు నిర్వహిస్తున్నాయి. యోగ చెయ్యండి, దాని నుంచి మీకు కొంత రిలీఫ్ ఉంటుంది అని ఆ కౌన్సిలింగ్ లో చెప్పారని నా మిత్రుడు అన్నాడు. శంఖంలో పోస్తే గానీ తీర్థం అవదు అన్నట్లు, మన యోగా గురించి ఈ ఇంగ్లీష్ వాళ్ళు చెప్తే కానీ నమ్మటం లేదు మనవాళ్ళు. 

నేను తొమ్మిదో తరగతి లో ఉన్నప్పుడు మా నాన్న యోగ నేర్చుకోవడానికి వెళ్తే పగలబడి నవ్విన జనాన్ని చూశాను. ఆయన ఉదయం పూట ఇంట్లో యోగ చేస్తుంటే, అది చూసి మా ఇంటికి వచ్చిన నా ఫ్రెండ్స్ నవ్వుకునేవారు.  ఎవరు నవ్వితే మనకేంటి అని గత పాతికేళ్లుగా ఆయన యోగా చేస్తూనే ఉన్నారు. నేనూ ఒకప్పుడు రెగ్యులర్ గా చేసేవాడిని కానీ ఆ తర్వాత ప్రొడక్షన్ సపోర్ట్ లో పని చేయాల్సి వచ్చింది, దాని వల్ల లేట్ నైట్ ప్రొడక్షన్ ఇష్యూస్, డెప్లాయిమెంట్స్ అని రాత్రుళ్ళు మేలుకోవలసి వచ్చి లైఫ్ బాగా డిస్టర్బ్ అయింది . కంపెనీ స్పాన్సర్డ్ వర్క్ వీసా నా మెడ మీద కత్తి లాగా ఉండేది, కాబట్టి ఇష్టం లేకపోయినా చెయ్యాల్సి వచ్చేది.  ఆ గ్యాప్ తో యోగ అనేది నా లైఫ్ లో పార్ట్ టైం జాబ్ లాగా అయిపొయింది.  'ఫిట్నెస్ కోసం ఇవాళ అర గంట  టైం కేటాయించలేకపోతే, రేపెప్పుడో  రెండు గంటలు టైం హాస్పిటల్ చుట్టూ తిరగడానికి కేటాయించాల్సి వస్తుంది' అని తెలిసీ యోగా ని రెగ్యులర్ గా చేయాలి అనే విషయాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నాను. 

స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనే దాని మీద చైనా లో జోక్ లాంటి ఒక  నిజం చలామణిలో ఉంటుంది. ఇప్పుడు దాన్ని COVID ఎఫెక్ట్ కి అన్వయించుకోవచ్చు. 

ఆ జోక్ ఏమిటంటే 

రెండు నెలల క్రితం, మార్కెట్ బాగుండేది. నేను తినేదే నా కుక్క కూడా తినేది. 

పోయిన నెల, మార్కెట్ కొంచెం దెబ్బతింది, నా కుక్క తినేదే నేనూ తిన్నాను. 

ఈ నెల మార్కెట్ పూర్తిగా క్రాష్ అయింది, నా కుక్కనే నేను తిన్నాను. 

కాస్త చేదుగా, ఎబ్బెట్టుగా అనిపించినా ఇది కాదనలేని నిజం. త్వరలో ఈ COVID కేసెస్ తగ్గి, ఇక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తేస్తుందని, అందరం మళ్ళీ సాధారణ జీవితాన్ని గడుపగలుగుతామని  ఆశిస్తున్నాను. 

6 కామెంట్‌లు:

  1. మీరన్నట్టు సింగులు సింగాలేనండి. త్వరలోనే మీ ఊళ్లోనే కాదు అన్ని చోట్లా లాక్డౌన్ ఎత్తేయాలని ఆశిద్దాం .

    రిప్లయితొలగించండి

  2. శంఖంలో పోస్తేనే తీర్థం,తెల్ల తోలోళ్ళు

    చెప్పినా నమ్మేలా లేరు లెండి.
    Dont be afraid of karOnaa but be beware of it. Wish you all. all the best.

    రిప్లయితొలగించండి
  3. నాకు తెలిసి, మన దేశంలో ముష్టి వాళ్ళు కనపడని రాష్ట్రాలు రెండే రెండు.
    ఒకటి పంజాబ్, రెండు గుజరాత్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సింగ్స్ బిచ్చమెత్తరు అని నేనూ విన్నాను బొనగిరి గారు.

      తొలగించండి