6, జులై 2021, మంగళవారం

మోకాలికి బోడిగుండుకి ముడెట్టడమంటే ఏమిటి? - సామెతల వివరణ

మోకాలికి బోడిగుండుకి ముడెట్టడమంటారు కదా, దాని అర్థం ఏమిటి?

చెప్తా కానీ, మా పవన్ కళ్యాణ్ కి జాతీయ అవార్డులు బోలెడు రావాల్సింది, ఎవరో అడ్డుకుంటున్నారు. 

మతుండే మాట్లాడుతున్నావా? నాకు నటన రాదు, నేనేమి గొప్ప నటుడిని కాదు అని మీ పవన్ కళ్యాణ్ కొన్నివందల సార్లు కెమెరా ముందు చెప్పాడుగా.   

అదంతా ఆయన గొప్పతనం అంతే. 

సరే ఇప్పుడేమంటావ్?

అదే అన్యాయం జరిగిందంటాను. 

డిటైల్డ్ గా చెప్పు. 

కమల్ హాసన్, ప్రకాష్ రాజ్, అమీర్ ఖాన్ వీరంతా గొప్ప నటులా  కాదా? 

అవును, అందులో అనుమానం లేదు.  

మరి  మా పవన్ కళ్యాణ్ కూడా అని ఒప్పుకో 

ఇదిగో అర్థం పర్థం లేని వాగుడు వాగకు. 

వివరంగా చెప్తా వినుకో, కమల్ హాసన్, ప్రకాశ్ రాజ్, అమీర్ ఖాన్ వీరంతా 2 పెళ్ళిళ్ళు చేసుకున్న వారేగా. 

అవును, అయితే?

2 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళే గొప్ప నటులైతే మూడు చేసుకున్న మా వాడు గొప్ప నటుడు కాదంటావా? 

కమల్ హాసన్, ప్రకాష్ రాజ్, అమీర్ ఖాన్ విడాకులు తీసుకున్నారని అలా విడాకులు తీసుకున్నోళ్లంతా గొప్ప నటులని అనడం మూర్ఖత్వం.  నీ వాదన అర్థం పర్థం లేకుండా ఉంది. 

కదా,  దీన్నే మోకాలికి బోడిగుండుకి ముడెట్టడం అంటారు,  చూడ్డానికి రెండూ నున్నగా, గుండ్రంగా ఉన్నా దేని గొప్ప దేనిదే, రెంటికి పోలిక లేదు. ఇప్పుడర్థం అయిందా దానిలోని మర్మం. 


2 కామెంట్‌లు:

  1. అసలు వివరణ ఏంటో గానీ మీ వివరణ మాత్రం భలేగా ఉంది 😀

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఏం చేస్తాను లలిత గారూ, నేను అభిమానించే నటులందరూ ఇలా విడాకుల బాట పడుతుంటే, బాధ తట్టుకోలేక ఏదో రాసేశాను.

      తొలగించండి