23, జులై 2021, శుక్రవారం

బాలయ్య కు భారత రత్న ఇవ్వాల్సిందే

"ఏంటి కబుర్లు" అంటూ ఫోన్ లో ఫ్రెండ్.  

ఏముంది, మా బాలయ్య కు భారతరత్న ఎప్పుడిస్తారా? అని ఆలోచిస్తుంటే నువ్వు ఫోన్ చేశావ్. 

ఇది మరీ విడ్డూరంగా ఉంది. ఒక ముతక సామెత చెప్పినట్లు, పెద్దాయన అంటే గౌరవం ఉంది కాబట్టి అది చెప్తే బాగోదు. అయినా తండ్రికే ఇవ్వట్లేదు అంటే కొడుక్కి కావాలంటావ్?

నేను కావాలని అనట్లేదు, భారత రత్న తనకి ఇవ్వాలని మా బాలయ్యే అన్నాడు. 

అదెప్పుడు?

మొన్నొక ఇంటర్వ్యూ లో 

అలా అనలేదే, భారత రత్న మా నాన్న చెప్పుతో సమానం అన్నాడు. 

కదా, మరి తండ్రి ఆస్థి ఎవరికి చెందాలి

కొడుక్కి 

మరి భారతరత్న వాళ్ళ నాన్న చెప్పుతో సమానం అంటే అది వాళ్ళ నాన్న ఆస్థి అయినట్లే కదా. తండ్రి ఆస్థి అయినా అస్తికలు అయినా కొడుక్కే కదా చెందాలి.  కాబట్టి భారత రత్న ని మా బాలయ్యకే ఇవ్వాలి. 

అలా వచ్చావా. ఖర్మ. నిన్ను, బాలయ్య ను అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు. 

సర్లే వాళ్ళో వీళ్లో ఇచ్చేదేమిటి? నేనే ఇస్తా బాలయ్య బాబు కి భారత రత్న. 

అదెలా?

మొన్నా మధ్య హీరో  సుమన్ కు 'దాదా సాహెబ్ పాల్కే' అవార్డు ఇచ్చారు కదా అలా. 

సుమన్ కు 'దాదా సాహెబ్ పాల్కే' అవార్డు ఏంటి? మతుండే మాట్లాడుతున్నావా?

అవును, పేపర్స్ లో ఆ వార్త చదివలేదా?

లేదే? 

చెప్తా విను. సుమన్ కు 'దాదా సాహెబ్ పాల్కే' అవార్డు ఇచ్చారని పేపర్లో చదివా.  సామాన్యంగా  మన తెలుగోళ్ళకి అవార్డు ఇవ్వరు, ఒక వేల ఇచ్చినా ఏదో పెద్ద రేంజ్ లో లాబీయింగ్ జరగాలి.  మరి సుమన్ కి అంత రేంజ్ లేదు, పైగా కృష్ణ లాంటి సీనియర్ యాక్టర్ ని పెట్టుకొని సుమన్ కి ఎందుకు ఇచ్చారు? అయినా అమితాబ్ కి రజని కాంత్ కి ఇచ్చారు కాబట్టి పాపులారిటీ లో వారి తర్వాతి స్థానం చిరంజీవిదే  కాబట్టి తనకైనా ఇవ్వాలి కానీ సుమన్ కి ఎలా ఇచ్చారు అని కాస్త శోధిస్తే తెలిసిందేమిటంటే ఏదో ఒక సంస్థ వాళ్ళిచ్చే అవార్డుకి  ''దాదా సాహెబ్ పాల్కే" అని పేరు పెట్టేసుకొని ఇచ్చేస్తున్నారట.  అలా నేను కూడా ఇస్తా బాలయ్య బాబు కి భారత రత్న. 

ఖర్మ రా దేవుడా ?  నీ ఇష్టం. జేమ్స్ కామెరూన్ కన్నా, రెహమాన్ కన్నా మీ బాలయ్య తక్కువేం కాదు కాబట్టి భారతరత్న తో పాటు ఆస్కార్ కూడా ఇచ్చుకో. 

9 కామెంట్‌లు:

 1. పవన్ కుమార్ రెడ్డి గారికి “జ్ఞా న పీ ఠ్” అ వా ర్డ్ ప్రకటించడమైనదిట.
  అభినందనలండీ.
  😁😁

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధన్యవాదాలు మేస్టారు మీరు గుర్తించి నాకు అవార్డు ఇచ్చినందుకు. ప్రతిగా నేను మీకు నోబెల్ శాంతి పురస్కారం ఇస్తున్నాను, స్వీకరించండి.

   ఇస్తినమ్మ వాయినం పుచ్చుకొంటి నమ్మా వాయినం 😁

   తొలగించండి
  2. ధన్యవాదాలు రెడ్డి మహాశయా. నార్వే వీసా కోసం అప్లై చేస్తాను, నా acceptance speech కూడా తయారు చేసుకోవడం మొదలెడతాను 😁😁😁😁😁.

   తొలగించండి
  3. సమయం మించిపోతోంది మేష్టారు త్వరగా, అసలే కోవిడ్ కాలం. ఏ నిమిషానికి ఏమి జరుగునో..

   తొలగించండి
 2. ఆ ఇస్తారు :) . శ్రీ కృష్ణ జన్మస్థానం పంపించాలి ముందు ఆయనను. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటమే మరీను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కష్టం చంద్రిక గారు, ఇలా మాట్లాడటానికి జైలుకు బెల్లకుండా ఉండటానికి హాస్పిటల్ వారిదే certificate ఇచ్చారని అప్పుడెప్పడో గుసగుసలు వినిపించాయి.

   తొలగించండి
 3. మీరిచ్చేది భారతరత్న(ఆస్ట్రేలియా) అని చెప్పండి (మిస్ ఇండియా ఆస్ట్రేలియా, మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియా ల లాగ). యే కేసులు, కొట్లాటలు ఉండవు. అలాగే మీరిచ్చే నోబెల్ (no-bell) శాంతి బహుమతి కి విన్నకోటవారిని నార్వే వరకు వెళ్ళక్కర్లేదని చెప్పండి. వాట్సప్ వీడియో కాల్ తో అవార్డుని శాంతియుతంగా తీసుకోవచ్చని చెప్పండి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆహా, ప్రయాణం చెయ్యనక్కర లేదు అంటే మనస్సుకు “శాం తి” గా ఉంది. థాంక్స్ కాంత్ గారు
   “No-bell” హ్హ హ్హ హ్హ, ఈ పేరేదో బాగుందే 😁😁.

   తొలగించండి
  2. నేను చిన్నప్పుడు Pepsi అని కాకుండా Popsi అని అదే డిజైన్ తో ఒక cooldrink వచ్చేది. చదువు రాని వారికి ఆ డిఫరెన్స్ తెలీక పోయేది. అలా No-bell బాగుంది కాంత్ గారు.

   తొలగించండి