ఎప్పుడూ మంచి సినిమాలే పెట్టవు అంటుంది మా ఆవిడ రోజూ టీవీ లో సినిమా పెట్టినప్పుడు. ఏం చేస్తాం నిశ్శబ్దం, మోసగాళ్ళు, సాహో లాంటి చెత్త సినిమాలే చూశాను ఈ మధ్య కాలంలో.
జాతి రత్నాలు సినిమా రిలీజ్ టైములో ఆ సినిమా ప్రోమోస్, యాడ్స్ యూ ట్యూబ్ లో చూసి ఈ సినిమాకి థియేటర్ కి వెళదాం అంది. మా ఆవిడ. సోషల్ మీడియా లో కనపడే జోక్స్ ని సినిమాలో పెట్టారు ఇదీ ఒక సినిమానేనా అని వద్దన్నాను. నా ప్రెడిక్షన్స్ ఎప్పుడూ తప్పు కాలేదు కాబట్టి తనూ పట్టుపట్టలేదు సినిమాకి తీసుకెళ్ళమని.
ఆ తర్వాత ఈ సినిమా హిట్టయిందని విని చూశావా అనవసరంగా మంచి సినిమాని మనం మిస్ అయ్యాము అంది. సరే, నాకు దాని మీద ఇంటరెస్ట్ లేకపోయినా అమెజాన్ లో ఎలాగూ ఎప్పటి నుంచో ఉంది కదా అని ఆ సినిమా పెట్టాను కనీసం నవ్వుకోవడానికి బాగుంటుందని .
ప్రధాన నటుల ప్రతిభ తప్ప ఏ రకంగానూ మెప్పించని సినిమా ఇది. అసలు ఇలాంటి సినిమా ఎలా హిట్టయిందో దేవుడికే ఎరుక. కాస్త ఎక్కువ పబ్లిసిటీ చేసి హడావిడి చేసేసి హిట్ చేసే tactics వంటబట్టించుకున్న వారు ఉన్నట్లు ఉన్నారు ఈ సినిమా వెనుక, 'సరిలేరు నీకెవ్వరూ' లాంటి సినిమాకి దిల్ రాజు ఉన్నట్లు. నిండుకుండ తొణకదు కానీ ఇదిగో ఇలా విషయం తక్కువ హడావిడి ఎక్కువ సినిమాలే తెగ తొణుకుతూ ఉంటాయి. టీవీ లోనూ సోషల్ మీడియా లోనూ ఇంతకంటే మంచి జోకులు కనపడుతుంటాయి. సోషల్ మీడియా లోదొరికే ఒక పది జోకులను, సెటైర్ లను పోగేసుకొని ఈ సినిమా తీసినట్లు అనిపించింది కథ కాకరకాయ మాకెందుకు అని, ఈ మాత్రం దానికి జబర్దస్త్ చూడటం బెటర్.
మత్తు వదలరా, బ్రోచేవారెవరురా, షాదీ ముబారక్ లాంటి మంచి సినిమాలు కూడా చూశాను ఈ మధ్యకాలంలో. మత్తు వదలరా లో నటించిన ముగ్గురు కుర్రాళ్ళలో ముందుగా చెప్పుకోవలసింది కమెడియన్ సత్య గురించి మాత్రమే. వచ్చిన కొత్తలో ఇతను ఎక్కువగా సునీల్ ని ఇమిటేట్ చేసేవాడు కానీ ఈ మధ్య కాలంలో ఆ ఇమిటేషన్ ని కాస్త తగ్గించి బాగా షైన్ అయ్యాడు. ఒకే మూసలో వస్తున్న తెలుగు సినిమాలకి ఇలాంటి కొత్త దర్శకుల అవసరం ఎంతైనా ఉంది. హీరో అనగానే 6 పాటలు, 4 ఫైట్స్ అనే ధోరణి పోవాలి అప్పుడే ఇండస్ట్రీ లో మంచి సినిమాలు వస్తాయి.
నట వారసుల కంటే మంచి ఫిజిక్, డైలాగ్ డెలివరీ, నటన ఉన్న సత్య దేవ్ లాంటి నటులు బ్రోచేవారెవరురా లాంటి సినిమాలో చిన్న చితక పాత్రల్లో నటించాల్సిరావడం తెలుగు సినిమా కి పట్టిన చీడ.
షాదీ ముబారక్ ఫస్ట్ హాఫ్ సినిమా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం బోర్ కొడుతోంది. సాధారణంగా సెకండ్ హాఫ్ సరిగ్గా తీయలేకపోవడాన్ని సినిమా పరిభాషలో సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అంటారు. ఇది చాలా మంది దర్శకుల్లో ఉంటుంది. షాదీ ముబారక్ సినిమా చూస్తున్నంత వరకు ఈ సినిమా బాగుందే ఎందుకు అంత హిట్ కాలేదు అని ఆలోచించా. అలా ఆలోచించిన కాసేపటికే అర్థం అయింది, సినిమా లో సెకండ్ హాఫ్ నుంచి ఫ్లో దెబ్బ తింది అని. ఇవన్నీ సినిమా రివ్యూ లో రాసే మాటలు. నా భాషలో చెప్తాను ఎక్కడ సినిమా మీద ఇంటరెస్ట్ తగ్గింది అన్నది.
సినిమా గురించి మాట్లాడేముందు ఈ సినిమాలో ఆకట్టుకునే విషయం ఏమిటంటే అది హీరోయిన్. ముఖ్యంగా ఆమె ఎక్సప్రెస్సివ్ కళ్ళు సినిమా చూస్తున్నంతసేపూ ఆకట్టుకుంటాయి. మంచి నటి అనిపించుకునే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో, పైగా చిట్టి పొట్టి బట్టలు లాంటివి వేసుకోకుండా పద్దతిగా బట్టలు వేసుకుంది.
సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే హీరోయిన్ చీర కట్టుకుంటుంది. ఇక అదే చీర తోనే ఆల్మోస్ట్ ఇంటర్వెల్ వరకూ కథ జరుగుతుంది. ఆ చీర తోనే సినిమా అంతా హీరోయిన్ కనపడినా ప్రాబ్లెమ్ ఉండేది కాదు. ఏదో మాల్ లోపలికి వెళ్ళి డ్రెస్ కొనుక్కొని, అదే డ్రెస్ వేసేసుకొని వస్తుంది. అహ, ఇది అవసరమా? సినిమా బాగా సాగే టైములో. ఆ డ్రెస్ ఏమైనా బాగుంటుందా అంటే అది ఛండాలంగా ఉంటుంది పైగా మెళ్ళో అదేదో పూసల దండ దరిద్రంగా. అంత వరకు దేవ కన్య లా అందంగా అనిపించిన ఆ అమ్మాయి ఉన్నట్లుండి ఒక మామూలు అమ్మాయిగా అనిపిస్తుంది. సరే సర్దుకుపోదాం అనుకుంటే మళ్ళీ అదే డ్రెస్సులో అర్థం పర్థం లేకుండా పబ్బులో పాట ఒకటి. (ఈ కాలం యూత్ కి ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సులు, పబ్బుల్లో పాటలు నచ్చుతాయి అనుకుంటా, బట్ నాకు నచ్చలేదు ఎంతైనా కాస్త ఓల్డ్ జనరేషన్ కదా) సినిమా అంటే పాటొకటి ఉండాల్సిందే అనే భావన పోతే గానీ సినిమాలు బాగుపడవు. పాటలు పెట్టాలి అనుకుంటే సినిమా ఫ్లో కు అడ్డుపడకుండా ఎలా తీయాలో పవన్ కళ్యాణ్, కరుణాకర్ కాంబినేషన్ లో వచ్చిన తొలిప్రేమ చెబుతుంది.
మరీ హీరోయిన్ గురించి ఎక్కువ రాసేశాను కదా, ఏం చేస్తాం మగబుధ్ధి. హీరో గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఋతురాగాలో, చక్రవాకమో ఏదో సీరియల్లో పాపులర్ అయిన సాగర్ ఈ సినిమాలో హీరో. ఛిచ్చీ! హీరోల గురించి ఇంత కంటే ఇంకేం చెపుతాం చాలు చాలు.
“జాతి రత్నాలు” …. హుఁ …. నేను బాగా నవ్వుకున్నాను సుమండీ - ఆ సినిమా చూస్తున్న నన్ను చూసి నేనే నవ్వుకున్నాను (నా మీద నాకే జాలి వేసింది అనాలి నిజానికి) 😞.
రిప్లయితొలగించండి// “ఈ మాత్రం దానికి జబర్దస్త్ చూడటం బెటర్” // అంటున్నారా? ఆ పని చెయ్యకండి అని నా ఉ.బో.స. కాలుతున్న పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లవుతుంది పరిస్ధితి. అయినా మీకు అటువంటి ఆలోచనలు రావడం ఏమిటి ఎంత నిరాశ ఆవహించినప్పటికీ?
// “6 పాటలు, 4 ఫైట్స్” // తో బాటు .. ఒళ్ళు నెప్పులు ఉన్నవాడో లేక స్కూల్లో డ్రిల్ చేసేవాడో చేసే విన్యాసాల లాంటి డాన్సులు … అటువంటి హీరోలని తలకెత్తుకుని మోసారుగా తెలుగు ప్రేక్షకులు చాలా కాలం ? అటువంటి హీరోలే ఆ తరువాత వచ్చిన నటులకు రోల్ మోడల్స్ అయ్యారు కూడా కాబట్టి ఆ ధోరణి అలాగే కొనసాగుతోంది.
సత్యదేవ్ మంచి నటుడు. ఎందుకనో పైకి రావడం లేదు (రానివ్వడం లేదా 🤔🤔??).
Yes, “షాదీ ముబారక్” సినిమా సిల్లీ కథ అయినా బాగానే ఉంది కానీ క్లైమాక్సు హాస్యాస్పదంగా ఉంది. మన సినిమాలు అధిక భాగం రెండో సగం అంత బాగా రాకపోవడానికి కారణం నేననుకోవడం ఏదో మంచి ఉద్దేశంతోనే మొదలు పెడతారు కానీ మధ్యకు వచ్చేసరికి హిట్ అవదేమో అనే బెంగ పట్టుకుని దారి మర్చిపోతారనుకుంటాను (సునీల్ “కథ, స్క్రీన్-ప్లే, దర్శకత్వం అప్పలరాజు” అనే సినిమా చూశారా? మంచి ఐడియాతో మొదలెట్టిన సినిమా అనేక ఒత్తిళ్ళ వల్ల చివరకు ఎంత ఛండాలంగా తయారవుతుంది అనే ఇతివృత్తంతో బాగా తీసిన సినిమా).
“షాదీ ముబారక్” సినిమా హీరోయిన్ బాగుంది, బాగానే నటించింది … కానీ as usual తెలుగమ్మాయి కాదు 🙁.
“సమ్మోహనం” కూడా చాలా బాగా నడిచిన కథ, కానీ చివర్లో కాస్త హాస్యాస్పదంగా తయారయింది అనిపించింది.
// “ కాస్త ఓల్డ్ జనరేషన్ కదా” // ఎవరు? మీరా? ఏదో సినిమాలో “నువ్వూ నేనూ ఇంకా యూత్ ఏమిటి అంకుల్” అంటాడు చూశారా అలాగ మీరు అప్పుడే ఓల్డ్ జనరేషన్ ఏమిటండీ? మాకు పోటీయా? 😁
కొన్ని కొన్ని మరాఠీ భాషా చిత్రాలు బాగా తీసినవి ఉన్నాయండి. మీకు “prime video” ఉందన్నారు కాబట్టి ఆసక్తి ఉంటే చూడండి. సమాజంలోని కొన్ని కొన్ని సమస్యలను కథగా మలచి బాగా తీసినవి ఉన్నాయి. కాకపోతే సబ్-టైటిల్స్ పెట్టుకుని చూడాలి. అస్తిత్వ, అస్తు (✅), ఏక్ కప్ చాయా (✅), గణవేష్, బాప్ జన్మ, కొంకణస్త, స్మైల్ ప్లీజ్ (✅), సైకిల్, షేర్ని (Sherni)(✅) … మచ్చుకి కొన్ని. ఇంకా ఉన్నాయి.
సర్లెండి, ఇప్పటికే నా కామెంట్ మీ పోస్టు కన్నా పొడుగై పోయింది.
తొలగించండిఏదో మాట వరసకి అన్నాను గానీ, జబర్దస్త్ చూసే ధైర్యం చేయను మేష్టారు.
ప్రతీ ఇరవయ్యేళ్ళ కొకసారి జనరేషన్ టేస్ట్ మారుతుందట మేష్టారు, కాబట్టి నేను ఓల్డ్ జనరేషన్ కిందకే. మీరు ఇంకొంత ఓల్డ్ జనరేషన్ కిందకి వెళ్లిపోయినట్లు :(
మీరు కూడా సినిమాలేవీ వదలకుండా చూసేటట్లు ఉన్నారే. మంచి సినిమాలు సజెస్ట్ చేసినందుకు ధన్యవాదాలు మేష్టారు. షేర్ని సినిమా మొన్నీ మధ్యే చూశాను,మంచి రియలిస్టిక్ సినిమా.
Corona కాల ప్రభావం. ఇంట్లోంచి బయటకు వెళ్ళే ధైర్యం చెయ్యలేం కాబట్టి ధైర్యం తెచ్చుకుని సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తూ OTT ని ఉద్ధరిస్తుంటానన్నమాట 🙂.
తొలగించండిVNR గారు, మీరు ఇందుగలడందులేడని మీకు పరిచయం లేని, రాని, తెలియని కళలేమి లేనట్టున్నాయి. మీ వ్యాఖ్య అద్భుతః!
రిప్లయితొలగించండిఅందుకే కదండీ ఆయనను నేను మేస్టారు అనేది.
తొలగించండి🙂🙂 పవన్.
తొలగించండి“అజ్ఞాత” గారూ, thanks. ఏదో మిడిమిడి జ్ఞానం అంతే.
దానం అంటే గుప్తదానం చెయ్యమన్నారు గానీ మంచి మాట చెప్పడం కూడా అజ్ఞాతగనేనా 🤔🙂?
I 100% agree with your review about Jaatiratnaalu.
తొలగించండిNow you that you got your driver license, you can save yourself from falling victim to such kind of films. Have been watching lots of outback road trip videos of late. Lots of beautiful places to explore there. Why not bark on an outback trip?
Sorry for the typo -
రిప్లయితొలగించండిWhy not embark on an outback trip?
Well said నాగేశ్వర రావు గారు. Yes, there are beautiful places in and around Australia. But due to COVID couldn't explore much after I got the licence. I am eagerly waiting for the trips. Thanks for the wonderful suggestion.
తొలగించండి