5, జులై 2021, సోమవారం

ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండేది పక్కోడే

గత రెండేళ్ళలో పర్మనెంట్ రెసిడెన్సీ కోసం PTE (IELTS, TOEFL లాంటిది), తర్వాత ఇంటర్వ్యూ కోసం జావా, AWS ఆ తర్వాత కార్ డ్రైవింగ్ టెస్ట్ ల (Driver Knowledge Test, Hazard Perception Test) కోసం మెటీరియల్స్, ఇవాళ్టి వరకు సిటిజెన్ షిప్ టెస్ట్ కోసం ఆస్ట్రేలియన్ హిస్టరీ చదవాల్సి వచ్చింది. గత రెండేళ్ళలో ఏదో ఒక టెస్ట్ కోసం ప్రతీ రోజూ ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. అసలే డిగ్రీ వరకు గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ పైగా తెలుగు మీడియం చదువులు కాబట్టి PTE కోసం ఒక 3 నెలలు తెగ చదవాల్సి వచ్చింది. ఈ చదివేదేదో కాలేజీ రోజుల్లో చదివుంటే స్టేట్ ఫస్ట్ కాకపోయినా యూనివర్సిటీ ఫస్ట్ అయినా వచ్చేవాడినేమో. లేదంటే కాలేజీ తర్వాతి రోజుల్లో చదివుంటే ఏ IAS / IPS పాస్ అయి ఈ తొక్కలో సాఫ్ట్వేర్ జాబ్ చేయాల్సి వచ్చేది కాదు. 

ఇవాళ ఉదయాన్నే ఒక పని మీద బ్యాంకు కి వెళ్తే ఎక్కడ పని చేస్తున్నారు అని అడిగాడు అక్కడ కౌంటర్లో వ్యక్తి. నేను మీడియా కి సంబంధించిన కంపనీ లో పనిచేస్తాను కాబట్టి నేను ఫలానా కంపెనీ లో పని చేస్తాను అనగానే మీరు జర్నలిస్టా అని అడిగాడు వెంటనే. అదైనా బాగుండు 24 గంటలు ఈ కంప్యూటర్ ముందు కూర్చొని టిక్కు టిక్కు మని కీ బోర్డు మీద కోడింగ్ చెయ్యాల్సిన బోరింగ్ జాబ్ పని తప్పేది అని అనుకున్నాను కానీ అది తప్పని తర్వాత అర్థమైంది. 

ఇవాళ మధ్యాహం మీటింగ్ లో ఒక వ్యక్తి ని కలిశాను. 40+ వయసు ఉండి ఉంటుంది కానీ చాలా వరకు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కి సంబంధించిన టెర్మినాలజీ విషయంలో అర్థం కాక ఒకటికి రెండు సార్లు అదేమో ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగాడు. లంచ్ టైం లో మాటల మధ్యలో   Lawyer వృత్తి లో  కొన్నేళ్ళు పని చేసి సాఫ్ట్వేర్ వైపు వచ్చానని చెప్పాడు. 

నాకు తెలిసినంతవరకు లేదా చూసినంతవరకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి టీచర్ జాబ్స్ కి, పోలీస్ జాబ్స్ కి లేదంటే బిజినెస్ వైపుకు వెళ్లడం జరిగింది కానీ Lawyer వృత్తి నుంచి సాఫ్ట్వేర్ వైపుకు వచ్చినట్లు వినడం ఇదే మొదటి సారి, కారణం ఏంటో తెలుసుకోవచ్చా అని అడిగాను. 

లాయర్ వృత్తిలో మనుషులతో డీల్ చేయాలి అండ్ ఇట్ ఈజ్ unpredictable, వాళ్ళ బిహేవియర్ మారుతూ ఉంటుంది కొన్ని సార్లు మోసపోతాం కూడా, కానీ కంప్యూటర్స్ అలా కాదు అన్నాడు. 

నాకేమో ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ బోర్ కొడుతుంది వేరే జాబ్ ఏదైనా అయితే ఇంటరెస్టింగ్ గా ఉంటుంది అని అనుకుంటున్నాను. అందుకేనేమో The other side of the grass is always greener లేదంటే మన అచ్చ తెలుగులో దూరపు కొండలు నునుపు అన్నారు. 

ఈ జాబ్ విషయం లోనే కాదు ప్రతీ విషయం లోనూ చాలా మంది ఇలానే ఆలోచిస్తుంటారు. ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండేది పక్కోడే  అని అనుకుంటాం గానీ పీత కష్టాలు పీతవి సీత కష్టాలు సీతవి అనే విషయం మరచి పోతాము. 

9 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. 79, 90, 89, 85.

      4 సార్లు రాస్తే, మొదటి సారి 10 పాయింట్స్ తెచ్చుకున్నా, నాలుగో సారి చచ్చి చెడి అలా గట్టున పడి 20 పాయింట్స్ తెచ్చుకున్నా రాజేష్ గారు.

      తొలగించండి
  2. Nenu one year kastapadithe 76 vachinda, appatiki vasayu datipoyundi- so vadilesha… now am 41 years… 😌

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాకు ఇంకో రెండు నెలల్లో 40+ పడుతుంది అనగా కాలం కలిసొచ్చింది అంతే రాజేష్ గారు, ఇందులో నా గొప్పేం లేదు.

      NAATI exam try చెయ్యండి, 5 పాయింట్స్ Gain చెయ్యొచ్చు.

      తొలగించండి
  3. Citizenship పరీక్ష విజయవంతంగా పూర్తి చేసినందుకు Hearty Congratulations, పవన్ గారు !

    రిప్లయితొలగించండి
  4. విద్యార్థులకు పరీక్షలొస్తే చిత్రమైనదా పోరాటం, పోరాటం!

    రిప్లయితొలగించండి
  5. విద్యార్థులకు పరీక్షలొస్తే చిత్రమైనదా పోరాటం, పోరాటం!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విద్యార్థులకు తప్పదు ఆ పోరాటం నాగేశ్వర రావు గారు.

      తొలగించండి